కన్యాకుమారిలోని సుప్రసిద్ధ వివేకానంద స్మారక చిహ్నం ఏర్పాటులో కీలక పాత్రధారి, రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త పి. లక్ష్మణన్ (86) జనవరి 22న కన్నుమూశారు. అనేక సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న కన్యాకుమారి వివేకానంద కేంద్రంలో మధ్యాహ్నం 3:00 గంటలకు తుది శ్వాస విడిచారు.
కేరళ కోజికోడ్‌లోని వెల్లైయిల్‌కు చెందిన లక్ష్మణన్ 1962లో శ్రీపాదపార (వివేకానంద శిల)ను తిరిగి పొందేందుకు చేసిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు. నాటి ఆ ఉద్యమమే నేటి సుప్రసిద్ద వివేకా
1962 మిషన్: వివేకానంద శిల తిరిగి స్వాధీనం
పి. లక్ష్మణన్ పేరు చెబితే 1962లో కన్యాకుమారిలో చేపట్టిన సాహసోపేతమైన ఉద్యమం స్ఫురణకు వస్తుంది. కన్యాకుమారి సముద్ర తీరంలో ఉన్న రాతిశిలను క్రైస్తవ మిషనరీలు చట్టవిరుద్ధంగా ఆక్రమించారు. వెంటనే ఆ ప్రదేశంలో ఒక శిలువ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం పేరును ‘కన్యాకుమారి’ నుండి ‘కన్య మేరీ’గా మార్చేందుకు ఒక పథకం ప్రకారం మొదలైన కుట్రను రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సకాలంలో గుర్తించింది.
“ఆపరేషన్ విజయదశమి”
స్వయంసేవకుల బృందం కన్యాకుమారికి పయనమైంది. అక్కడి సముద్ర ప్రవాహాలు, భూభాగం, భద్రతా పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఈ బృందం అనేక రోజులు కన్యాకుమారిలో బస చేసింది. అక్టోబర్ 8, 1962 విజయదశమి పర్వదినాన స్వయంసేవకుల బృందం సముద్రమార్గంలో ఈదుకుంటూ క్రైస్తవ మిషనరీలు ఆక్రమించిన ప్రాంతానికి చేరుకుంది. అక్కడి రాతిపైకి ఎగబాకి ఆ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన శిలువ, ఇతర నిర్మాణాలు తొలగించారు.
ఈ పోరాటాన్ని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్, కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర సంస్థలు వివేకానంద శిలకు కలిగిన “విముక్తి”గా పరిగణిస్తాయి. ఏకనాథ్ రనడే నిర్మించిన సుప్రసిద్ధ వివేకానంద శిలా స్మారక చిహ్నానికి ఈ పోరాటం మార్గం సుగమం చేసింది. పి.లక్ష్మణన్ తన జీవితాన్ని ఈ లక్ష్యానికి అంకితం చేశారు. ఈ పోరాటంలో తన పాత్రను “భారత మాత పాదాలకు చేసిన ఆధ్యాత్మిక సమర్పణగా” భావించారు.
15 మంది సభ్యుల బృందం ఇదే:

More Stories
తమిళనాట బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖాయం
శశి థరూర్ పార్టీ మీటింగ్ కు గైరాజర్.. మోదీ సభకు హాజరు
కేరళలోనూ గుజరాత్ తరహాలో త్వరలో అధికార మార్పు