మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు
ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు దక్షిణమధ్య రైల్వే మేడారం జాతర ప్రత్యేక రైళ్లను ఈ నెల 28 నుంచి నడుపనుంది. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్‌, కాజీపేటల వరకు నడుపుతున్నారు.
 
ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్‌ రిజర్వుడ్‌ జనసాధారణ రైళ్లని జాతర వెళ్లే భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు. ఇవి ఆయా మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్‌ -మంచిర్యాల్‌- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు కాజీపేట మీదుగా కాజీపేట మీదుగా నడుస్తాయి.
 
 సికింద్రాబాద్‌-మంచిర్యాల్‌ రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల్‌ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల్‌-సికిందరాబాద్‌ రైలు (07496) మంచి ర్యాల్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికిందరాబాద్‌ చేరుకుంటుంది. ఈ నెల 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్‌-సిరిపూర్‌ కాగజ్‌ నగర్‌-సికింద్రాబాద్‌ మేడారం (07497/07498) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి, ఈ తేదీలలో మేడారం జాతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటాయి.

మేడారం వరకు నేరుగా రైలు మార్గం లేని కారణంగా, వరంగల్ మరియు కాజీపేట రైల్వే స్టేషన్ల వరకు ప్రత్యేక రైళ్లను నిర్వహిస్తారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట/వరంగల్ వరకు నడవనున్నాయి. అక్కడి నుంచి భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ద్వారా మేడారం చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు.  రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక బస్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైలు నుండి దిగగానే భక్తులు ఆ బస్సుల్లో కూర్చొని మేడారం చేరుకునేలా సర్వీసులు కొనసాగిస్తారు.