మున్సిపల్ ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకే

మున్సిపల్ ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకే
తెలంగాణలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బిసిలకు రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్‌లను కేటాయించగా మరో 30 జనరల్‌కు, జనరల్ మహిళకు 31 సీట్లను కేటాయించారు.
 
ఈ రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను పురపాలక శాఖ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం, బిసిలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ రిజర్వేషన్‌లను ఖరారు చేసినట్టు ఆమె తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్టుగా తెలిసింది.
 
10 కార్పొరేషన్లలో ఒకటి ఎస్సీ (రామగుండం), ఒకటి ఎస్టీ (కొత్తగూడెం), 3 బిసిలకు (మహబూబ్‌నగర్ బిసి మహిళా, మంచిర్యాల, కరీంనగర్‌లను బిసి జనరల్‌కు) కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు అన్ రిజర్వ్‌డ్ కింద కేటాయించారు. ఈ ఐదు కార్పొరేషన్లలో నాలుగు జనరల్ మహిళలకు కేటాయించారు.  కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్‌కు, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ బిసి మహిళకు అవకాశం కల్పించారు.
ఇక, మంచిర్యాల కార్పొరేషన్ బిసి జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బిసి జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసి కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు. 
 
మున్సిపాలిటీలో రిజర్వేషన్‌ల వివరాలు
 
కల్లూరు ఎస్టీ (జనరల్), భూత్పూర్ ఎస్టీ (జనరల్), మహబూబాబాద్ ఎస్టీ (జనరల్), కేసముద్రం ఎస్టీ (మహిళ), ఎల్లంపేట ఎస్టీ (మహిళ), స్టేషన్ ఘన్‌పూర్, ఎస్సీ (జనరల్), చొప్పదండి ఎస్సీ (మహిళ), జమ్మికుంట ఎస్సీ (జనరల్), హుజూరాబాద్ ఎస్సీ (మహిళ), ఏదులాపురం ఎస్సీ (మహిళ), డోర్నకల్ ఎస్సీ (జనరల్), లక్షెట్టిపేట ఎస్సీ (జనరల్), మూడుచింతలపల్లి ఎస్సీ (జనరల్), నందికొండ ఎస్సీ (జనరల్), మొయినాబాద్ ఎస్సీ (జనరల్), గడ్డపోతారం ఎస్సీ (మహిళ), కోహెర్ ఎస్సీ (జనరల్), ఇంద్రేశం ఎస్సీ (మహిళ).
 
చేర్యాల ఎస్సీ (మహిళ), హుస్నాబాద్ ఎస్సీ (జనరల్), చేర్యాల ఎస్సీ (మహిళ), హుస్నాబాద్ ఎస్సీ (జనరల్), వికారాబాద్ ఎస్సీ (మహిళ), మోత్కూర్ ఎస్సీ (మహిళ), ఇల్లందు బిసి (మహిళ), జగిత్యాల బిసి (మహిళ), జనగామ బిసి (జనరల్), భూపాలపల్లి బిసి (జనరల్), అయిజ బిసి (జనరల్), వడ్డెపల్లి బిసి (జనరల్), అలంపూర్ బిసి (జనరల్), బిచ్కుంద బిసి (జనరల్), కామారెడ్డి బిసి (మహిళ)లకు కేటాయించారు.