బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. గత మూడు వారాల్లోనే బంగ్లాదేశ్‌లో పది మందికి పైగా హిందువులు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, పెట్రోల్ పంపులో ఇంధనం నింపుకుని డబ్బులు చెల్లించకుండానే వెళ్లిపోతున్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు హిందూ వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి హతమార్చారు.
ఈ విషాద సంఘటన రాజ్‌బరి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని 30 ఏళ్ల రిపోన్ సాహాగా గుర్తించారు. అతడు అక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. రాజ్‌బరిలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో రిపోన్ సాహా ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఒక బ్లాక్ కలర్ ఎస్యూవీ కారులో వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) రాజ్‌బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ పెట్రోల్ నింపుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండానే వెళ్లడానికి ప్రయత్నించాడు. వారు సుమారు రూ.3,710 విలువైన పెట్రోల్ పోయించుకున్నారు.
దీంతో రిపోన్ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, రిపన్ సాహాను కారుతో తొక్కించి హత్య చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదంలో రిపన్ సాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హషేమ్, అతడి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

More Stories
ఇరాన్లో సమాచార వ్యాప్తిని అడ్డుకొంటున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్
ఇరాన్ వైపు అమెరికా యుద్ధనౌకలు
గ్రోక్లో అసభ్య చిత్రాలు.. ఎలాన్ మస్క్‌పై మాజీ లవర్ దావా