BRUSSELS, BELGIUM - DECEMBER 17: President of the European Commission Ursula von der Leyen (L) and the President of the EU Council Antonio Luis Santos da Costa (R) arrive for an EU-Western Balkans Summit in the Europa building, the EU Council headquarter on December 17, 2025 in Brussels, Belgium. This summit will highlight the EUWestern Balkans politicaleconomic partnership, reaffirm the EU's unequivocal commitment to the Balkans' eventual EU membership, and stress the need for tangible reform progress, alignment with the acquis and deeper regional cooperation, all underpinned by the 6billion Growth Plan that aims to accelerate integration into the EU single market and boost the region's economic convergence. (Photo by Thierry Monasse/Getty Images)
భారత గణతంత్ర వేడుకలకు ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలను ముఖ్య అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరి పర్యటనలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న భారత-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
అమెరికా సుంకాలు, వాణిజ్య విధానాలపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కోస్టా, ఉర్సులా జనవరి 25 నుంచి మూడు రోజుల పర్యటనను భారత్కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనవరి 27న జరగనున్న 16వ భారత్-ఈయూ సమిట్‌కు కోఛైర్‌గా కోస్టా, ఉర్సులా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రతి పాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇరు పక్షాల మధ్య 135 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ క్రమంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. చివరిగా15వ భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశం 2020 జూలైలో వర్చువల్‌గా జరిగింది.
2025 ఫిబ్రవరిలో ఈయూ కమిషనర్ల కళాశాల భారత్‌కు చేసిన చారిత్రక పర్యటన అనంతరం, ద్వైపాక్షిక సంబంధాలు అనేక రంగాల్లో మరింత బలోపేతమయ్యాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్‌టీఏతో పాటు, శిఖరాగ్ర సమావేశంలో రక్షణ వ్యవస్థపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, అలాగే కొత్త వ్యూహాత్మక అజెండాను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఐదు కీలక రంగాల్లో కొత్త వ్యూహాత్మక అజెండా ఆమోదం పొందనుంది. అందులో భద్రత-రక్షణ, కనెక్టివిటీ, గ్లోబల్ అంశాలు, సస్టెయినబిలిటీ, సాంకేతికత అండ్ ఆవిష్కరణ అనే ఐదు ప్రధాన రంగాల్లో భాగస్వామ్యం కానునంది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య మెగా ఎఫ్‌టీఏ కుదిరితే అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది.

More Stories
అకల్ తఖ్త్ ముందు హాజరైన సీఎం మాన్
ఆదిశంకరాచార్య గ్రంథావళి గుజరాతీ ఎడిషన్ ఆవిష్కరణ
మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమికి 146 సీట్లు