నాలుగేళ్ల తర్వాత తొలిసారి నెం 1 బ్యాటర్ గా కోహ్లీ

నాలుగేళ్ల తర్వాత తొలిసారి నెం 1 బ్యాటర్ గా కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్కు చేరుకున్నాడు. ప్రస్తుతం విరాట్ 785 రేటింగ్స్తో నెం.1 ర్యాంక్లో ఉన్నాడు. గత నాలుగేళ్లలో వన్డే ర్యాంకింగ్స్లో నెం.1 పొజిషన్కు చేరుకోవడం విరాట్కు ఇదే తొలిసారి.

37 ఏళ్ల కోహ్లీ  2021 జూలై త‌ర్వాత మ‌ళ్లీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని ఆక్ర‌మించుకున్నాడు. కోహ్లీ ఫ‌స్ట్ వ‌న్డేలో కివీస్‌పై 93 ర‌న్స్ స్కోరు చేశాడు. దీంతో అత‌ను వ‌న్డేల్లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన రెండో బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఫ‌స్ట్ లో స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు.  న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 రేటింగ్స్తో రెండు స్థానంలో ఉన్నాడు. టాప్ లో విరాట్, డారిల్ మిచెల్ లకు ఒకే రేటింగ్ పాయింట్ తేడా ఉండడం గమనార్హం. 

ఇక స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టాప్ నుంచి మూడో స్థానంకు పడిపోయాడు. గత కొన్ని రోజులుగా వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ టాప్ లో ఉన్నాడు. అయితే ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ స్వల్ప స్కోర్ కే  ఔటయ్యాడు. అదే సమయంలో విరాట్ గత ఐదు వన్డే మ్యాచుల్లో 50+ స్కోర్లు సాధించాడు. దీంతో కోహ్లీ ఒక స్థానం మెరుగుపర్చుకోగా, రోహిత్ రెండు స్థానాలు దిగజారాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 775 రేటింగ్ తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ ల్లో విరాట్ రెండు సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సహా 303 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్లో మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ప్రస్తుతం కివీస్తో జరుగుతున్న సిరీస్ లోనూ  తొలి మ్యాచ్ లో  విరాట్ 93 పరుగులతో రాణించాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలా విరాట్ ఆడిన ఆఖరి 5 వన్డేల్లో అన్నింట్లోనూ 50+ స్కోర్లు చేశాడు.