ఏడాదిలో లక్ష వీసాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్

ఏడాదిలో లక్ష వీసాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా లక్షకు పైగా వీసాలను రద్దు చేశారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన వారిని, నేర చరిత్ర ఉన్నవారిని ఏరిపారేస్తుని ప్రకటించిరు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దయిన లక్ష వీసాల్లో విద్యార్థులవే వేల సంఖ్యలో ఉండటం ఆందోళనకరంగా ఉంది. మొత్తం రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 స్టూడెంట్ వీసాలు ఉన్నాయి.

అలాగే 2,500 స్పెషలైజ్డ్ వీసాలు ఉన్నాయి. వీరందరూ ఏదో ఒక సందర్భంలో అమెరికా భద్రతా బలగాలతో గొడవ పడినవారే. లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములైన వారేనని అధికారులు వెల్లడించారు. ఎందుకు ఇంత భారీగా వీసాలు రద్దు చేస్తున్నారనే దానిపై స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా నాలుగు తప్పులు చేసిన వారిపై వేటు పడింది. వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే అక్రమంగా ఉండటం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిపోవడం. ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడటం. షాపుల్లో చోరీలు లేదా ఇతర దొంగతనాలు చేయడం లాంటివి కారణాలుగా చెబుతున్నారు.

అమెరికా విదేశాంగ శాఖ ‘ఎక్స్’ వేదికగా చాలా ఘాటుగా స్పందించింది. “దేశ భద్రత మాకు ముఖ్యం. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఇలాంటి దుర్మార్గులను దేశం నుంచి తరిమికొడతాం. వీసా రద్దు, డిపోర్టేషన్ అనేవి దేశ రక్షణ కోసం వాడుతున్న ఆయుధాలు” అని స్పష్టం చేసింది. వలసదారులు కచ్చితంగా చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని ఆ దేశ విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది.

2024తో పోల్చితే ఈ ఏడాది వీసాల రద్దు ఏకంగా 150 శాతానికి పైగా పెరిగింది. ఒకే ఏడాదిలో లక్ష వీసాలు రద్దు చేయడం ఇదే రికార్డు అని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలస చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, 2025లో రద్దు చేసిన వీసాల సంఖ్య, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన చివరి సంవత్సరమైన 2024లో నమోదైన 40,000 రద్దుల కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. 2025లో జరిగిన చాలా వీసా రద్దులు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన వ్యాపార, పర్యాటక ప్రయాణికులకు సంబంధించినవి కాగా, సుమారు 8,000 మంది విద్యార్థులు, 2,500 మంది ప్రత్యేక వీసా హోల్డర్ల పత్రాలు చట్టాన్ని అమలు చేసే అధికారులతో నేరపూరిత సంబంధాల కారణంగా రద్దు చేసిన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.