నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ (రిటైర్డ్)కి భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) నోటీసు జారీ చేసింది. కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తన గుర్తింపును ధృవీకరించేందుకు ఎన్నికల అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. గోవాలో ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్న సందర్భంగా సర్ అధికారులు అంతకు ముందు ఆయన ఇంటికి వెళ్లారు. సర్ కోసం ఆయన తన ఐడెంటిటీ చూపాలని ఈసీ అధికారులు కోరారు.
1971భారత్-పాకిస్తాన యుద్ధంలో వీరోచిత పోరాటానికి గాను భారత ప్రభుత్వం అడ్మిరల్ అరుణ్ ప్రకాష్‌ను ‘వీర్ చక్ర’ అవార్డుతో గౌరవించింది. పదవీ విరమణ అనంతరం ఆయన గోవాలో స్థిరపడ్డారు. ఆయన వివరాలు 2002లో చివరిగా సవరించిన ఓటరు జాబితాలో లేవని, ఆయన ‘గుర్తించబడని’ వర్గంలోకి వస్తాడని దక్షిణ గోవా జిల్లా రిటర్నింగ్ అధికారి ఎగ్నా క్లిటర్ తెలిపారు.
నేవీ మాజీ చీఫ్ గణన ఫారమ్‌ను పరిశీలిస్తామని దక్షిణ గోవా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ వివరణ ఇస్తూ నేవీ మాజీ చీఫ్ ఎన్యుమరేషన్ ఫామ్‌లో అనేక వివరాలు లేవని చెప్పింది. కోర్టాలిం అసెంబ్లీ నియోజకవర్గంలో నేవీ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్ నుంచి పార్ట్ నెంబర్ 43కి చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ సమాచారాన్ని సేకరించారని, అయితే ఎన్యుమరేషన్ దరఖాస్తులో అవసరమైన వివరాలు లేవని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ మెడోరా ఎర్మోమిల్లా డీకాస్టా తెలిపారు.
గతంలో సర్ చేపట్టినప్పుడు కూడా ఆ వివరాలు లేవని, వాటిల్లో ఓటరు పేరు, ఎపిక్ నెంబర్, బంధువు పేరు, అసెంబ్లీ నియోజకవర్గ పేరు, నెంబర్, పార్ట్ నెంబర్, సీనియరల్ నెంబర్ లేవని చెప్పారు. కీలకమైన ఐడెంటిఫికేషన్ వివరాలు లేనందు వల్లే బీఎల్ఓ అప్లికేషన్ ఆటోమెటిక్‌గా అప్డేట్ కాలేదని పేర్కొన్నారు. తంలో సర్ చేపట్టినప్పుడు అన్ని అంశాలను ఖాళీగా వదిలి వేయడం వల్ల , కంప్యూటర్ సిస్టమ్‌లో ఆ ఎన్యుమరేషన్‌ను అన్మ్యాప్డ్ కేటగిరీగా చూపించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
ఐడెంటిటీ వివరాలను పొందుపరిస్తేనే బీఎల్వో అప్లికేషన్ ఆటోమెటిక్‌గా అప్డేట్ అయ్యే రీతిలో డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ నోటీసులపై అడ్మిరల్ ప్రకాష్ స్పందిస్తూ తన భార్య, తాను ఎస్ఐఆర్ ఫారమ్‌లో అన్ని కాలమ్స్‌ను నింపామని, ఇసి వెబ్సైట్లో గోవా ముసాయిదా ఓటరు జాబితా2026లో తమ పేర్లను చూశామని చెప్పారు. ఇప్పుడు ఇసి నోటీసులిచ్చిందని, విచారణకు హాజరవుతానని ఎక్స్‌లో పేర్కొన్నారు. 1971 ఇండోపాక్ వార్‌లో పనిచేశారని, వీర చక్ర అవార్డు గెలిచారని, ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆందోళనకరంగా ఉన్నట్లు కొందరు సైనిక దళాల విరమణ సభ్యులు పేర్కొన్నారు.

More Stories
22 భాషల్లోకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనువాదం
అమెరికాకు భారత్ కంటే కావాల్సిన దేశం ఇంకోటి లేదు
జర్మన్ యూనివర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ప్రారంభించాలి