పీఎస్‌ఎల్‌వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం

పీఎస్‌ఎల్‌వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం ఏర్పడిందని ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. ప్రయోగం మూడో దశ వరకు సాఫీగానే సాగినట్లు చెప్పారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. మూడో దశ చివర్లో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయినట్లు చెప్పారు.  సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. 

ఉదయం 10 గంటల 18 నిమిషాల 30 సెకన్లకు శ్రీహరికోట నుంచి ఉపగ్రహం నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో కొంత అంతరాయం ఏర్పండింది.  శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-62 రాకెట్‌ను సోమవారం ఉదయం ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా 14 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది.

ఈ ఉపగ్రహం బరువు 1,485 కేజీలు. దీనికి అన్వేషగా నామకరణం చేశారు. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన శాటిలైట్‌లో అత్యంత అధునాతమైనది. ‘ఈవోఎస్‌-ఎన్‌1’ (అన్వేష)ను రోదసిలోకి పంపుతున్నారు. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్ఎస్ఐఎల్) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకమైనది. రోదసి నుంచి భారత్‌ నిఘా సామర్థ్యాల్ని పెంచేదిగా, భూమిపై ఓ కన్నేసి ఉంచటంగా ‘అన్వేష’ను శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

దీంతోపాటు స్పానిష్‌ స్టార్టప్‌ తయారుచేసిన చిన్నపాటి ‘క్యాప్సుల్‌’ను, మరో 17 దేశవిదేశాలకు చెందిన శాటిలైట్స్‌ను ఇస్రో ఈ మిషన్‌ ద్వారా నింగిలోకి పంపింది. దీంతోపాటు స్పానిష్‌ స్టార్టప్‌ తయారుచేసిన చిన్నపాటి ‘క్యాప్సుల్‌’ను, మరో 17 దేశవిదేశాలకు చెందిన శాటిలైట్స్‌ను ఇస్రో ఈ మిషన్‌ ద్వారా నింగిలోకి పంపుతున్నది. దీంట్లో ‘క్యాప్సుల్‌’ ఒక్కటే దక్షిణ పసిఫిక్‌ సముద్రజలాల్లో ‘స్లాష్‌డౌన్‌’ అవుతుంది. దేశరక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.

ఇది పీఎస్ఎల్‌వీ కార్యక్రమానికి ఇటీవల ఎదురైన రెండో వైఫల్యం. గతంలో, మే 18, 2025న, శ్రీహరికోట నుండి ప్రయోగించిన కొద్ది నిమిషాలకే ఇస్రో నమ్మకమైన పీఎస్ఎల్‌వీ రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో ఇస్రో విఫలమైంది. ఆ మిషన్‌లో, అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో చేపట్టిన 101వ ప్రయోగంలో, పీఎస్ఎల్‌వీ-సి61 రాకెట్ ఉదయం 5:59 గంటలకు ఎలాంటి లోపం లేకుండా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

కానీ ప్రయోగం ప్రారంభమైన 12వ నిమిషంలో ఒక సాంకేతిక సమస్య తలెత్తింది. మోటార్ కేస్ యొక్క చాంబర్ పీడనంలో తగ్గుదల కారణంగా ఈ మిషన్ పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్ వంటి విజయాల కారణంగా ఇస్రో  ‘నమ్మకమైన అశ్వం’ అని పిలువబడే పీఎస్ఎల్‌వీ చరిత్రలో ఇది కేవలం నాలుగవ వైఫల్యం మాత్రమే.