రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే ఉక్రెయిన్‌కు పటిష్టమైన భద్రత కల్పిస్తామని అమెరికా, దాని మిత్రదేశాలు హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్‌లో శాంతి కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరిగిన సమావేశంలో ఈ హామీని ఇచ్చాయి. కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌కు తమ దళాలను తరలిస్తామని స్పష్టం చేశాయి.
ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్, బ్రిటన్ అధ్యక్షులు కెయిర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, అమెరికా ప్రతినిధి బృందం పాల్గొన్నారు. అమెరికా బృందంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కీలక సభ్యుడుగా ఉన్నారు. ఉక్రెయిన్ భధ్రతకు అమెరికా కూడా హామీ ఇచ్చింది. రష్యాతో శాంతి ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు భద్రతా దళాలను తరలించే ఉప్పందంపై జెలెన్‌స్కీ, మాక్రాన్, స్టార్మర్ సంతకాలు కూడా చేశారు.
ఈ సమావేశం తరువాత వివరాలను నాయకులు వెల్లడించారు. ఉక్రెయిన్ భద్రత కోసం తాము కట్టుబడి ఉన్నామని, కాల్పుల విమరణ తరువాత ఉక్రెయిన్ దాడులను నిరోధించడానికి, ఉక్రెయిన్ పునర్మిణానికి సహాయం చేస్తామని నాయకులు తెలిపారు. ‘కోలిషన్ ఆఫ్ విల్లింగ్’ పేరుతో మంగళవారం, బుధవారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు కల్పించడంపై భాగస్వామ్య దేశాల మధ్య గణనీయమైన ఏకాభిప్రాయం ఏర్పడినట్టు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది.
సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ భద్రత విషయంలో మిత్రదేశాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతటి అపూర్వమైన ఐక్యత కనిపించిందని పేర్కొన్నారు. కేవలం యుద్ధం ఆపడమే కాకుండా, భవిష్యత్తులో శాంతిని నిలబెట్టేందుకు అవసరమైన సెక్యూరిటీ గ్యారెంటీలపై అందరూ ఒకే తాటిపైకి వచ్చారని ఆయన స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ విశేషమైన పురోగతి ఈ భేటీలో సాధించినప్పటికీ ఇక్కడ కుదిరిన ఒప్పందాన్ని ప్రతి దేశం ఆమోదంపాల్సి ఉందని చెప్పారు.
“భూమిపై, గాలిలో, సముద్రంలో భద్రతా హామీల అంశాలలో, అలాగే పునరుద్ధరణలో ఏ దేశాలు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాయో మేము నిర్ధారించాము,” అని జెలెన్స్కీ చెప్పారు. “ఏ బలగాలు అవసరమో మేము నిర్ధారించాము. ఈ బలగాలను ఎలా నడపాలి? ఏ కమాండ్ స్థాయిలలో నడపాలో మేము నిర్ధారించాము.” అని తెలిపారు.
“ఇదంతా శాంతి ఆధారపడే ఆచరణాత్మక పునాదులను నిర్మించడం గురించే,” అని బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. అయితే అత్యంత కష్టమైన పని ఇంకా ముందుందని ఆయన సూచించారు. “పుతిన్ రాజీపడటానికి సిద్ధంగా ఉంటేనే మనం శాంతి ఒప్పందానికి చేరుకోగలం. కాబట్టి, మనం నిజాయితీగా ఉండాలి: రష్యా మాటలు ఎలా ఉన్నప్పటికీ, పుతిన్ శాంతికి సిద్ధంగా లేడని చూపిస్తున్నాడు” అని విమర్శించారు.
కుదిరిన హామీలలో భాగంగా, సంభావ్య కాల్పుల విరమణను పర్యవేక్షించడంలో సహాయం చేయడానికి అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఒకవేళ రష్యా తన దాడిని తిరిగి ప్రారంభిస్తే, పెద్ద ఎత్తున సైనిక మోహరింపుకు మార్గం సుగమం చేసే ప్రాంతీయ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, కాల్పుల విరమణ అమల్లోకి వస్తే ఉక్రెయిన్‌లో తమ బలగాలను మోహరిస్తామని ఫ్రాన్స్, యూకే హామీ ఇచ్చాయి.

More Stories
6.8 నుంచి 7.2 శాతం మధ్య జీడీపీ వృద్ధి
మున్సిపల్ ఎన్నికల వ్యూహంలో బిజెపి కేంద్ర నాయకులు
శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో బడా కుట్ర