మణిపూర్ హింసాకాండలో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పాత్ర ఉందని పేర్కొంటున్న పూర్తి ఆడియోక్లిప్‌ను ఫోరెన్సిక్ విభాగానికి పంపాల్సిందిగా సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి ఆడియోక్లిప్‌ను గుజరాత్‌లోని జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు)కి పంపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి ఆడియో క్లిప్‌ను ఎందుకు పంపలేదని జస్టిస్ సంజరుకుమార్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
2023 మణిపూర్ హింసాకాండలో మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పాత్ర ఉందని సూచిస్తుందన్న ఆడియో రికార్డింగ్‌ను కుకీ హక్కుల సంఘం సమర్పించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో చివరి విచారణ తర్వాతే కేంద్రానికి 48 నిమిషాల పూర్తి రికార్డింగ్ అందిందని సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. ఆడియో క్లిప్ కోసం విచారణ చేసినప్పటికీ ముందుగా అది రాలేదని చెప్పారు.
ఈ కేసు గతంలో 10సార్లు జాబితా చేయబడిందని, 48నిమిషాల మొత్తం రికార్డింగ్ టేప్‌ను పిటిషన్‌తో పాటు సుప్రీంకోర్టుకి సమర్పించినట్లు కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ (కోహుర్) తరపున న్యాయవాదులు ప్రశాంత్‌భూషణ్, చెరిల్ డిసౌజాలు ధర్మాసనానికి తెలిపారు. దీంతో మొత్తం రికార్డింగ్‌ను ప్రభుత్వానికి పంపాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. త్వరిత చర్య కోసం, సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించడానికి దానిని ఎన్‌ఎఫ్‌ఎస్‌యుకి పంపాలని మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Stories
అమిత్ షా కార్యాలయం ఎదుట టీఎంసీ నిరసన
రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ సాంకేతిక పరిజ్ఞానం
గాంధీజీ హత్య – నెహ్రూ అధికార సమీకరణ