రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వేశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ మోడల్‌లో రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు టికెట్లను కొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్)కు రైల్వే శాఖ సూచించింది.
ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రైల్‌వన్ యాప్‌లో ఆర్-వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్‌రిజర్వుడు టికెట్‌లకు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
రైలు టికెట్, ప్లాట్‌ఫామ్ టికెట్, ట్రైన్‌లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్క చోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే ‘రైల్‌వన్ యాప్’ను తీసుకొచ్చింది. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను ఏ డిజిటల్ పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్) ద్వారా కొనుగోలు చేసినా ఈ 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ 2026 జనవరి 14 నుండి జూలై 14 వరకు (ఆరు నెలలు) మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం ఆర్-వాలెట్ ద్వారా చెల్లింపులు చేసేవారికి లభిస్తున్న 3 శాతం క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుంది. కొత్తగా ఇతర డిజిటల్ పేమెంట్లకు కూడా ఈ డిస్కౌంట్ వర్తించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్)ను రైల్వే శాఖ ఆదేశించింది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఒకే వేదికపై అన్ని సేవలను అందించే ఉద్దేశంతో ఈ ‘సూపర్ యాప్’ను రూపొందించింది.

More Stories
జపాన్ ను అధిగమించి నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం
భారత్‌మాల భూసేకరణ కేసులో ఇడి దాడులు