యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌ సవరణ బిల్లు వెనక్కు పంపిన ముర్ము

యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌ సవరణ బిల్లు వెనక్కు పంపిన ముర్ము

యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌ సవరణ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెనక్కి పంపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఇటీవల బిల్లును పునర్విచారణ కోసం అసెంబ్లీకి తిరిగి పంపారని అధికారి తెలిపారు. అసెంబ్లీ ప్రతిపాదిత చట్టాన్ని పున:పరిశీలించాల్సి వుంటుందని వెల్లడించారు. యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ను నియమించే అధికారం తమకు ఇవ్వాలని కోరుతూ 2022 ఏప్రిల్‌లో స్టాలిన్‌ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. 

168 ఏళ్ల చరిత్ర కలిగిన మద్రాస్ యూనివర్శిటీని రెండేళ్లుగా వైస్‌ ఛాన్సలర్‌ లేకుండా నిర్వహిస్తోందని, యూనివర్శిటీని నియంత్రించే లక్ష్యంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రంలోని 22 విశ్వవిద్యాలయాలలో 14 రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో కన్వీనర్ కమిటీతో పాలనలో ఉన్నాయి.  ప్రస్తుతం యూనివర్శిటీ ఎక్స్‌-అఫీషియో ఛాన్సలర్‌గా పనిచేస్తున్న విసిని నియమించే, తొలగించే అధికారాన్ని గవర్నర్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం ద్వారా మద్రాస్‌ యూనివర్శిటీ చట్టాన్ని సవరించాలని బిల్లు కోరింది. 

అయితే  యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) నియంత్రణ, విసి నియామకాలను నియంత్రించే నిబంధనలకు ప్రతిపాదిత చర్య విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ గతంలో  గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఈబిల్లుని రాష్ట్రపతి పరిశీలన కోసం  రిజర్వ్‌ చేశారు. రెగ్యులర్‌ విసిలు లేకపోవడంతో యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌ సహా 22 యూనివర్శిటీలు 14 కన్వీనర్‌ కమిటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి.