రష్యా శాస్త్రవేత్తలు మొట్టమొదటి 7 లెవల్ క్వాంటం కంప్యూటర్ను రూపొందించినట్లు రష్యన్ క్వాంటం సెంటర్ (ఆర్క్యూసి) ప్రకటించింది. కొత్తరకం క్వాంటం యూనిట్‌ను వినియోగించి ఏడవ స్థాయిలో పనిచేసే మొదటి అయాన్ ఆధారిత కంప్యూటర్ను తయారు చేసినట్లు తెలిపింది. ఈ కొత్త సాంకేతికత కంప్యూటర్ను 72 క్విట్ క్వాంటం ప్రాసెసర్‌తో సమానంగా చేస్తుందని, ముఖ్యమైన గణనలను అధిక కచ్చితత్వంతో నిర్వహించేందుకు అనుమతిస్తుందని పేర్కొంది.
శాస్త్రవేత్తలు ఈ బహుళ స్థాయి విధానాన్ని 2021లో చాలా చిన్న వ్యవస్థతో పరీక్షించడం ప్రారంభించారని ఆర్క్యూజెడ్ డైరెక్టర్ మాగ్జిమ్ ఓస్ట్రాస్ పేర్కొన్నారు. కేవలం నాలుగేళ్లలో 72 క్విట్లకు సమానమైన నమూనాను రూపొందించామని తెలిపారు. ఇప్పటికే ఉన్న చాలా క్వాంటం కంప్యూటర్లు క్విట్‌లను వినియోగించి రూపొందించారని చెప్పారు. క్విట్లో కృత్రిమ పరమాణువు మాదిరిగానే రెండు శక్తి స్థాయిలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు.
శాస్త్రవేత్తలు ప్రస్తుతం మూడవ స్థాయి, నాలుగవ స్థాయి వ్యవస్థల వంటి సంక్లిష్టమైన క్వాంటం యూనిట్లతో పాటు ఉన్నత స్థాయి వాటిని కూడా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ విధానంలో తక్కువ పరమాణువులను వినియోగించి మరింత సమాచారాన్ని నిల్వ చేయగలరని, ప్రాసెస్ చేయగలరని అన్నారు. ఈ వ్యవస్థలు మరింత శక్తివంతమైనవని అయితే నియంత్రించడం కష్టమని చెప్పారు.
”కొత్త రష్యన్ క్వాంటం కంప్యూటర్ 26 కాల్షియం అయాన్లను వినియోగిస్తుంది. ప్రతి అయాన్ సున్నా నుండి ఆరు వరకు విలువలను తీసుకునే ఏడవ స్థాయి క్వాంటం యూనిట్‌గా పనిచేస్తుంది. ఈ వ్యవస్థను రూపొందించడానికి ఆర్క్యూసి శాస్త్రవేత్త కిరిల్ లక్మాన్స్కీ నేతృత్వంలోని పరిశోధనా బృందం ప్రత్యేక లేజర్ పరికరాలను మరియు సంక్లిష్టమైన ఆప్టికల్ నిర్మాణాన్ని అభివృద్ధి చేస్తోంది” అని తెలిపారు.
“ఇది క్వాంటం స్థితులను కచ్చితంగా నియంత్రించడానికి, కీలకమైన లాజికల్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ప్రాసెసర్ 99.92శాతం కచ్చితత్వంతో సింగిల్ క్విట్ ఆపరేషన్లను , 96.5 కచ్చితత్వంతో రెండు క్విట్ ఆపరేషన్లను చేయగలదని నిరూపించాయి. ఇది క్వాంటం సిస్టమ్‌లకు రికార్డు స్థాయి” అని వివరించారు.

More Stories
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఉక్రెయిన్‌కు అమెరికా 15ఏళ్ల పాటు భద్రత హామీ
జర్మనీలో భారత విద్యార్థులకు డిపోర్టేషన్ భయం