భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఐఆర్‌సిటిసి ఖాతా ఆధార్ అనుసంధానమైన ప్రయాణికుల కోసం రిజర్వేషన్ సమయాలను పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు సోమవారం నుండి అమలులోకి వచ్చాయి. టికెట్ బుకింగ్ వ్యవస్థలో దళారుల ఆగడాలను అరికట్టడానికి, అసలైన ప్రయాణికులకు మాత్రమే బెర్తులు దక్కేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
గతంలో జనరల్ రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలు మాత్రమే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత దీనిని ఉదయం 8 నుండి 10 గంటల వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ సమయాన్ని మరింత పెంచుతూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆధార్‌తో లింక్ అయిన వినియోగదారులు మాత్రమే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోగలిగే సమయాలను దశలవారీగా మార్చామని ఐఆర్‌సిటిసి తెలిపింది.
అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఎఆర్‌పి) ప్రారంభమయ్యే రోజున, సాధారణ రిజర్వేషన్ల కోసం ఆధార్ ఆధారిత బుకింగ్‌ను అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు.. దీంతో సామాన్య ప్రయాణికులకు టికెట్లు దొరుకుతాయని అధికారులు తెలిపారు. గత వారం అన్ని జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు పంపిన లేఖలో ఈ మార్పులను స్పష్టం చేశారు.
అయితే ప్రయాణికులు తమ ఐఆర్‌సిటిసి ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు అని రైల్వే అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

More Stories
ఐఏఎస్, ఐపీఎస్ ల ఆస్తుల వివరాలపై కేంద్ర అల్టిమేటం
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లను వెనక్కి నెట్టిన జయశ్రీ ఉల్లాల్
ఓలా, ఉబర్‌కు పోటీగా ‘భారత్ ట్యాక్సీ’