శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కొద్దిసేపటి ముందు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ‘పొగుడుతున్నట్లు’ కనిపించే ఒక సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపింది. ఆయన ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చర్చకు దారి తీస్తున్నది. 1990వ దశకానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను దిగ్విజయ్ సింగ్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ను కూడా దిగ్విజయ్ తన పోస్టులో కొనియాడారు. ఆయన ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చర్చకు దారి తీస్తున్నది. దిగ్విజయ్ పోస్టు చేసిన ఫోటోలో బీజేపీ నేత ఎల్కే అద్వాణీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. అణ్వాణీ కుర్చీలో కూర్చున్నారు. ఆయన ముందు నేలపై మోదీ కూర్చున్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ ఫోటోను దిగ్విజయ్ ట్వీట్ చేశారు.
ఆ ఫోటోను ఖోరా సైట్లో కనుగొన్నానని, చాలా ఆసక్తికరంగా ఆ ఫోటో ఉందని, అట్టడుగు స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, జన్ సంఘ నేతలు ఫోటోలో ఉన్నారని, నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినట్లు పేర్కొన్నారు. ఇది ఆ సంస్థ శక్తి అని, జై సియా రామ్ అంటూ దిగ్విజయ్ సింగ్ పోస్టు చేశారు. ఆ ఫోటోను 1996లో తీసినట్లు తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకర్ సింఘ్ వాఘేలా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆ ఫోటో తీసినట్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలను దిగ్విజయ్ ఎక్స్పోజ్ చేశారని బీజేపీ నేత సీఆర్ కేశవన్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో సంస్కరణలు, “వికేంద్రీకరణ” కోసం సింగ్ పిలుపునిచ్చిన వారం తర్వాత ఈ వివాదం తలెత్తింది. శనివారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో కూడా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.“రాహుల్ గాంధీ జీ, మీరు సామాజిక-ఆర్థిక సమస్యల విషయంలో పూర్తిగా పట్టుదల కలిగి ఉన్నారు. పూర్తి మార్కులు. కానీ ఇప్పుడు దయచేసి కాంగ్రెస్ ని కూడా చూడండి. ఈసిఐకి సంస్కరణలు అవసరమైనట్లే, భారత జాతీయ కాంగ్రెస్‌కి కూడా అంతే అవసరం” డిసెంబర్ 19న ఎక్స్ లో ఆయన పోస్ట్ పార్టీలో కలకలం రేపుతోంది.
“మీరు ‘ఆర్గనైజేషన్ శ్రీజన్’తో ప్రారంభించారు, కానీ మాకు మరింత ఆచరణాత్మకమైన, వికేంద్రీకృత పనితీరు అవసరం. మీరు దీన్ని చేయగలరని నాకు తెలుసు కాబట్టి మీరు దీన్ని చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఒకే సమస్య ఏమిటంటే మిమ్మల్ని ‘ఒప్పించడం’ సులభం కాదు,” అని సింగ్ అందులో తెలిపారు. “రాహుల్ గాంధీపై దిగ్విజయ్ సింగ్ బహిరంగంగా విభేదిస్తున్నారు. రాహుల్ గాంధీ పాలనలో కాంగ్రెస్ సంస్థ కూలిపోయిందని ఆయన స్పష్టం చేశారు” అంటూ ఈ పోస్ట్ పై బిజెపి జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు.
కాగా, శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కూడా దిగ్విజయ్ సింగ్ పార్టీలో కేంద్రీకరణ సమస్యను లేవనెత్తారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ హాజరయ్యారు.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన సింగ్, కాంగ్రెస్ పార్టీకి వికేంద్రీకరణ అవసరమని స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులను నియమిస్తున్నప్పటికీ, కమిటీలను ఏర్పాటు చేయడంలో విఫలమవుతోందని ఆయన ఎత్తి చూపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.తాను పెట్టిన ఈ పోస్టు గురించి తీవ్రస్థాయిలో దుమారం చెలరేగిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాజాగా దీనిపై స్పందించారు. “నేను కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీల సంస్థాగత నిర్మాణం గురించి మాత్రమే చెప్పాను. బీజేపీ భావజాలాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటాను” అని స్పష్టం చేశారు.
More Stories
హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి
అమెరికాను వణికిస్తున్న ‘డెవిన్’ మంచు తుఫాను
ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం