ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం

ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం
ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపంగా నిలుస్తార‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు. మాన‌వుల మ‌నుగ‌డ‌ను కాపాడేందుకు స‌త్యం, న్యాయం, ధ‌ర్మం వైపు నిల‌బ‌డేందుకు గురుగోబింద్ జీవితం, బోధ‌న‌లు ప్రేర‌ణ క‌లిస్తాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. ప‌ద‌వ సిక్కు మ‌త గురువు గురు గోబింద్ సింగ్ విజ‌న్ ఇప్ప‌టికీ అనేక మందిని సేవ‌, నిస్వార్ధ క‌ర్త‌వ్యం దిశ‌గా న‌డుపుతుంద‌ని కొనియాడారు.
గురు గోబింద్ సింగ్ జీ ప‌విత్ర‌మైన ప్ర‌కాశ్ ఉత్స‌వ్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఇవాళ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో కొన్ని ఫోటోల‌ను షేర్ చేశారు. గురుగోబింద్‌కు విన‌మ్రంగా న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ఏడాది పాట్నాలోని త‌క‌త్ శ్రీ హ‌రిమందిర్ పాట్నా సాహిబ్ వెళ్లిన ఫోటోల‌ను ఆయ‌న పోస్టు చేశారు. గురుగోబింద్‌కు చెందిన ప‌విత్ర పాద‌ర‌క్ష‌కులు జోరే సాహిబ్‌ను ద‌ర్శించుకున్న‌ట్లు కూడా మోదీ చెప్పారు.
గురుగోబింద్ సింగ్ కుమారులు సాహిబ్‌జాదే బాబా జోరావార్ సింగ్‌, బాబా ఫ‌తే సింగ్ అమ‌రులైనార‌ని, వారిని స్మ‌రించేందుకు డిసెంబ‌ర్ 28వ తేదీన వీర్ బాల్ దివ‌స్‌ను సెల‌బ్రేట్ చేస్తున్న‌ట్లు గ‌తంలో మోదీ చెప్పారు.  అయితే వీర్ బాల్ దివ‌స్ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను ఆర్గ‌నైజ్ చేస్తున్నారు. షాహిబ్‌జాదాల ధైర్య‌సాహ‌సాల గురించి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
గురు గోబింద్ సింగ్ కుమారులైన సాహిబ్‌జాదీలు భార‌తీయుల గుండె ధైర్యాన్ని, సాహ‌సాన్ని ప్ర‌ద‌ర్శించి.. క్రూర‌మైన మొఘ‌ల్ సుల్తాన్‌ల‌ను మ‌ట్టిక‌రిపించిన‌ట్లు శుక్ర‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ చెప్పారు.