`ఇక కార్యక్రమం ముగించుకొని హోటల్‌కు చేరుకున్నాము. మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారత్‌లోని ఇరాన్ రాయబారి నా వద్దకు వచ్చి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. ఏం జరిగింది అని నేను అడిగా. హమాస్ చీఫ్ హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ మాట విని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎలా జరిగిందని అడగ్గా.. ఇంకా వివరాలు తెలియదని చెప్పారు’ అని నాటి సంఘటనను గడ్కరీ గుర్తు చేసుకున్నారు.
గతేడాది జులైలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగింది. హనియా 1963లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్ గ్రూపులో చేరగా 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది.
హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనియా 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించిన తర్వాత గ్రూపులో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికైన హనియాను అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఆయన గాజా స్ట్రిప్‌ను వీడి ఖతార్‌లో నివాసం ఉంటున్నాడు.

More Stories
కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంపై దుమారం!
20 ఏళ్ల తర్వాత ఏకమైన ఠాక్రే సోదరులు
బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల