పంజాబ్ పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా పనిచేసి రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారి అమర్ సింగ్ చాహల్ సోమవారం పాటియాలాలోని తన నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో సుమారు రూ. 8.10 కోట్లు పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపంకు గురవడంతో సెక్యూరిటీ గార్డు రివాల్వర్‌తో తనను తాను ఛాతిలో కాల్చుకోగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
ఇక తుపాకీతో కాల్చుకోవడానికి ముందు అమర్ సింగ్ చాహల్ 12 పేజీల సుదీర్ఘ ఆత్మహత్య లేఖ కూడా రాసి పెట్టారు. పాటియాలాలో ఉన్న అమర్ సింగ్ చాహల్ నివాసంలో తుపాకీ పేలిన శబ్దం రావడంతో స్థానికులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. పోలీసులు 10 నిమిషాల్లోపే అక్కడికి చేరుకోగా తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న చాహల్‌ను వెంటనే పాటియాలాలోని పార్క్ (పారాస్) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలంలో చాహల్ రాసిన 12 పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో ఆయన తనకు జరిగిన మోసం గురించి.. గోడు వెళ్లబోసుకున్నారు. వెల్త్ అడ్వైజర్స్ పేరుతో తాను భారీ మోసానికి గురైనట్లు తెలిపారు. ‘ఎఫ్-777 డిబిఎస్ వెల్త్ ఈక్విటీ రీసెర్చ్ గ్రూప్’ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరగాళ్లు తనను సంప్రదించారని, వారు సెబీ గుర్తింపు పొందిన సంస్థగా తనను నమ్మించినట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆ సైబర్ మోసగాళ్లతో తనకు పరిచయం ఏర్పడిందని, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించినట్లు సూసైడ్ లేఖలో చాహల్ వెల్లడించారు. దీంతో భారీ లాభాలకు ఆశపడి. తన సొంత డబ్బు రూ. 1 కోటితో పాటు బంధువులు, స్నేహితుల వద్ద మరో రూ. 7.10 కోట్లు అప్పుగా తీసుకుని మరీ ఆన్‌లైన్ ద్వారా పలు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు లేఖలో రాశారు.
అప్పులు తిరిగి చెల్లించలేని స్థితిలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇలా ఆత్మహత్యకు యత్నించినట్లు ఆ లేఖ ద్వారా అర్థం అవుతోంది. తన చావుకు సైబర్ థగ్స్ కారణమని లేఖలో పేర్కొన్న అమర్ సింగ్ చాహల్ ఈ లేఖను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కూడా ఉద్దేశించి రాశారు. అమర్ సింగ్ చాహల్ పంజాబ్‌లో సంచలనం సృష్టించిన 2015 కోట్కాపుర కాల్పుల కేసులో కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. గురు గ్రంథ్ సాహిబ్ అగౌరవ ఘటనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపిన కేసులో ఆయనపై గతంలో ఛార్జిషీట్ కూడా దాఖలైంది.

More Stories
2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో సొంత పార్టీ వారి పాత్ర!
అక్రమ కోడైన్ దగ్గు సిరప్ వ్యాపారంతో ఎస్పీకి సంబంధం!
‘బాబ్రీ మసీదు’ నమూనా నిర్మాణం వెనుక రాజకీయ కుట్ర