హెచ్1 బి వీసాదార్లకు అమెరికాలో తరచూ మారుతున్న వీసా నిబంధనలు చుక్కలు చూపుతున్నాయి. తమ వర్క్ పర్మి ట్ల రెన్యూవల్‌కు తరలివచ్చిన హెచ్1 బి వీసాదార్లు, ప్రత్యేకించి యువత ఇప్పుడు భారత్‌లో నే చిక్కుపడ్డారు. అమెరికా కాన్సులర్ కార్యాలయాలు వారి అప్పాయింట్మెంట్లను అర్థాంతరంగా రీ షెడ్యూల్ చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. డిసెంబరు 15నుండి 26 మధ్య అప్పాయింట్మెంట్లు రద్దయ్యాయి.
అయితే ఇది అమెరికాలో క్రిస్మస్ పండుగ సీజన్. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా ఇంటర్వ్యూలన్నీ ఆలస్యమవుతున్నాయని విదేశాంగ శాఖ తెలియచేసింది. వీసాలకు దరఖాస్తులు చేసుకున్న వారెవరూ కూడా అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజలకు ఎలాంటి ముప్పు కలిగించరని నమ్మకం కలిగేలా స్క్రూటినీ చేస్తున్నారని పేర్కొంది.
జనవరిలో జరుగుతాయని చెపుతున్నారు కానీ అమెరికా వీసా ఇమిగ్రేషన్ వర్గాల నుంచి సంబంధిత విషయంపై పూర్తి స్థాయి అధికారిక నిర్థారణ రాలేదు. దీనితో భారతీయ ఐటి వర్గాలలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వందలాది మంది అభ్యర్థుల ఇప్పుడు దేశంలో నిలిచిపోవల్సి వచ్చిందని పలు ప్రముఖ లా కంపెనీలు తెలిపాయి. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణకు వందలాది మంది ఈ నెల తొలి దశలో ఇండియాకు వచ్చారు.
అయితే ఇప్పుడు వారి వీసా అపాయ్‌ట్మెంట్లు అర్థాతరంగా రద్దు కావడం, తర్వాత ఇంటర్వూ లు జరుగుతాయని చెప్పడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరం అయిందని వీసా సంబంధిత కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి తమ వద్ద చెరో డజనుకు పైగా కేసులు వున్నాయని భారత్‌లో ఇమ్మిగ్రేషన్ అటార్నీ వీణా విజరు అనంత్, అట్లాంటాలో ఇమ్మిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తున్న చార్లిస్ కుక్‌లు తెలిపారు. ఇంత గందరగోళం గతంలో ఎన్నడూ చూడలేదని దీనికి ఏదైనా పరిష్కారం సత్వరంగా వుందా అనేది కూడా తెలియడం లేదని వీణా విజరు వ్యాఖ్యానించారు.
భారత్‌లో చిక్కుండిపోయిన తమ ఉద్యోగుల కోసం కంపెనీలు ఎంతకాలం వేచి వుంటాయని వారు ప్రశ్నిస్తున్నారు. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 71శాతంమంది భారతీయులే వీసాలు పొందారు. అయితే భారత ప్రభుత్వం అమెరికా వీసా కష్టాలను పట్టించుకోకుండా అనేక దేశాలతో ఎఫ్‌టిఎ ఒప్పందాలకు ప్రాధాన్యతనివ్వడం గమనార్హం.

More Stories
దేశంలో 40 లక్షలే గన్ లైసెన్సులు
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్‌కు వాయిదా