ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు
పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే” అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు.
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు
పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే” అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు.
మహాత్మాగాంధీ జాతిపిత. ఓ పథకానికి ఆయన పేరు పెట్టి ఆయనను గౌరవించామని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ది పొందారు. కానీ గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పి ఆ గ్రామాలను అభివృద్ధి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనేది మహాత్ముడి ఆశయ. ఆ ఆశయాన్ని నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పుచేర్పులు చేసి “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” చట్టం తీసుకు వచ్చింది.
ఇందులో భారత్ పేరే ఉంది. భారత్ ఆత్మ మహాత్ముడు. ఆయన ఆశయాల రూపమే పథకం. బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కమ్యూనిస్టులు పూర్తిగా దిగజారారు. అందుకే పేరులో మతాన్ని చూస్తున్నాయి. కమ్యూనిస్టులకు వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” అనే పేరులోనూ తమ కనబడుతోందంటే ఎవరి మనసుల్లో మతోన్మాదం నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సెక్యూలరిజం అంటే ప్రతి పేరులోనూ హిందూత్వ దేవుళ్ల పేర్లను వెదుక్కుని వ్యతిరేకించడం కాదని కమ్యూనిస్టు పార్టీలు తెలుసుకోవాలి.
ఈ పథకం గ్రామప్రాంతాల్లో ప్రజలందరికీ మేలు చేసేది. ఏ కులానికీ, మతానికి ప్రత్యేకంగా కాదు. అలాంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తే పేదలపై కుట్ర చేసినట్లే.కమ్యూనిస్టులు తాము పేదలకు మేలు చేస్తున్నామంటూ సుదీర్ఘంగా చేస్తున్నది వాళ్లకు హాని చేయడమే. అసలు గాంధీ గారంటే అసహ్యం వ్యక్తం చేసే కమ్యూనిస్టులు నేడు వారి జపం చేస్తున్నారు. ఏనాడైనా వారి జయంతి, లేదా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారా ? వారు కార్యాలయంలో, లేదా పార్టీ కార్యక్రమాల్లో గాంధీ గారి ఫోటో ఏర్పాటు చేశారా ? ప్రజలకు సమాధానం చెప్పాలి.
“వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” లో గ్రామీణలకు ఉపాధి లభించే రోజులు 125కి పెరిగాయి. కానీ తగ్గిపోతాయని వితండవాతం చేస్తున్నారు కమ్యూనిస్టులు. గతంలో చేసిన పనులే చేస్తే ఉపాధి నిధులను మధ్యవర్తులు, దళారీలు కాజేసేవాళ్లు అలాంటి అవకాశం లేకుండా పూర్తి స్థాయి అకౌంటబులిటీతో పథకంలో మార్పులు చేస్తే మీరు ఎందుకు బాధపడుతున్నారు?
ఉపాధి హామీ చట్టం రద్దు చేశారన్నట్లుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు. కానీ ఆ చట్టంలో మార్పులు చేసి అవినీతికి చెక్ పెట్టి సమగ్ర గ్రామీణ వికాసానికి, కూలీల నుంచి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా ఎదిగేలా గ్రామీణుల్ని మారుస్తున్నారని ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారు.
ఎన్డీఏ కూటమి పార్టీల పెద్దలు స్పందించడం లేదంటూ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లాగా అందరూ బావిలో కప్పల్లా లేరు కాదా.
ఎన్డీఏ కూటమి పార్టీల పెద్దలు స్పందించడం లేదంటూ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లాగా అందరూ బావిలో కప్పల్లా లేరు కాదా.
ఆ పథకం గురించి సమగ్రంగా తెలుసుకున్న అందరూ సమర్థిస్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” ఈ పథకం దగ్గర దారి అని అందరికీ అర్థమైపోయిది. బీజేపీని వ్యతిరేకించాల్సిందే అని మనసులో పెట్టుకునే మాట్లాడే కమ్యూనిస్టులకు తప్ప. వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని కమ్యూనిస్టులు చెప్పడం వింతల్లో వింత.
ముందు ప్రజలకు మేలు జరిగే ఏ సమస్యలపై పోరాడారో వారు గుర్తు తెచ్చుకోవాలి. పేదలను రెచ్చగొట్టేందుకు.. కార్మికులను పస్తు పెట్టేందుకు పోరాటాలు చేశారు. వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్తారు. గ్రామీణులే ఆ పథకం అండతో తమ జీవితాల్ని మెరుగుపర్చుకుంటారు. కమ్యూనిస్టుల ప్రయత్నాలను తిప్పికొడతారు.

More Stories
ఫిబ్రవరి ఎన్నికలపై బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక ధోరణి, హింస నీలినీడలు!
2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో సొంత పార్టీ వారి పాత్ర!
అక్రమ కోడైన్ దగ్గు సిరప్ వ్యాపారంతో ఎస్పీకి సంబంధం!