పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ గ్రామ్ బిల్లు 2025, సుస్థిర భారతదేశ పరివర్తన కోసం అణుశక్తిని వినియోగించుకోవడం మరియు అభివృద్ధి చేయడం’ (శాంతి) బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
స్వాతంత్ర్యం తర్వాత అణు రంగంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంస్కరణగా విస్తృతంగా అభివర్ణించబడుతున్న శాంతి బిల్లు, అణుశక్తి చట్టం, 1962, అణు నష్టానికి పౌర బాధ్యత చట్టం, 2010లను రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ చట్టాలు దశాబ్దాలుగా ఈ రంగాన్ని నియంత్రిస్తున్నాయి మరియు. పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యానికి అడ్డంకులుగా తరచుగా పేర్కొంటున్నారు. ఈ చట్టం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలు, జాయింట్ వెంచర్లు ప్రభుత్వ లైసెన్సుతో అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి, సొంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి, మూసివేయడానికి అవకాశం లభిస్తుంది.
దీని ద్వారా సుసంపన్న, సుస్థిర గ్రామీణాభివృద్ధిని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పర్యవేక్షణకే కేంద్రానికే పరిమితం కానుంది. నిర్వహణ, జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. రైతులకు కూలీల లభ్యత పెరిగి కూలీరేట్లు నియంత్రణలో ఉండేందుకు వీలుగా వ్యవసాయ సీజన్లో 60 రోజులపాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని ప్రతిపాదించారు.
ఉపాధి కల్పించడంతోపాటు నాలుగు ప్రాధాన్య రంగాల్లో చిరకాలం మన్నే మౌలికవసతుల కల్పనకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. ప్రతిపనినీ వ్యూహాత్మక దృష్టితో చేపడతారు. జల భద్రత, మౌలికవసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటిద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. కూలీల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతోపాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తారు.

More Stories
‘బాబ్రీ మసీదు’ నమూనా నిర్మాణం వెనుక రాజకీయ కుట్ర
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో `మహాయుతి’ భారీ విజయం
సెక్యులర్ పాట పాడాలంటూ బెంగాల్ సింగర్‌కు వేధింపులు