భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం

భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం

భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ తెలిపారు. ధ్యానం చేస్తున్న వారి మనసు ఏకాగ్రతతో ఉంటుందని చెబుతూ మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచనలు చేశారు. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనంలో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్, శ్రీరామచంద్ర మిషన్‌ ల ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తూ డిసెంబరు 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించిందని , ధ్యానం, యోగాలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. మన దేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రమని, వికసిత్‌ భారత్‌లో ఆర్థిక అభివృద్ధే కాదని, దేశ శాంతి కూడా భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. 

అందరూ ధ్యానం చేసేలా శ్రీరామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు కమలేష్‌ డి పటేల్‌ (దాజీ) చొరవ చూపుతున్నారని తెలిపారు. “భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తోంది. ధ్యానం చేస్తున్న వారి మనసు ఏకాగ్రతతో ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలి. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యూఎన్‌వో ప్రకటించింది” అని చెప్పారు.

”ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనను జయించొచ్చు. మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటే ఏకాగ్రత వస్తుంది. తద్వారా సునాయాసంగా విజయాలు సాధించొచ్చు. ధ్యానం చేశాక వచ్చే మార్పును మనం గమనించొచ్చు” అని తెలిపారు.  ధ్యానం వల్ల అన్నింటిని జయించవచ్చన్న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ధ్యానం గురించి ప్రస్తావించాయని తెలిపారు.  ప్రజలందరూ పరస్పర సహకారంతో శాంతితో మెలగాలని సూచించారు. 

ధ్యానంతో ప్రశాంతంగా ఉండొచ్చని కమలేశ్‌ డి.పటేల్‌ (దాజీ) అన్నారు. ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనను జయించొచ్చని తెలిపారు. మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని, మనసు ప్రశాంతంగా ఉంటే ఏకాగ్రత వస్తుందని, . తద్వారా సునాయాసంగా విజయాలు సాధించొచ్చని, ధ్యానం చేశాక వచ్చే మార్పును మనం గమనించొచ్చని తెలిపారు. 170 దేశాలు ఇవాళ మెడిటేషన్ జరుపుతున్నాయని, 2,600 మెడిటేషన్ సెంటర్లలో మెడిటేషన్ చేస్తున్నారని వివరించారు.

రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా వర్చువల్‌ ద్వారా లక్ష మందితో ధ్యానం చేయిస్తున్నట్లు తెలిపారు.  గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రి శ్రీధర్‌ బాబులతో కలిసి ఒకే వేదికపై ధ్యానం చేశారు.