విజయవాడ విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. గత రెండురోజుల్లో టాస్క్ఫోర్స్ జరిపిన స్పెషల్ డ్రైవ్లో 55 మంది విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 10 నుండి బీటెక్ వరకు చదువుతున్న విద్యార్థులుగా తేల్చారు.
వీరిలో 12 మంది బీటెక్, 20 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులున్నారు. మిగిలిన వారంతా పదోతరగతి చదువుతున్నారు. ఎస్ఆర్ఆర్, కెబిఎన్, లయోలా, వెస్టిన్, మిక్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.
వీరంతా పేపర్ సిగరెట్ ద్వారా గంజాయిని సేవిస్తుండగా తమ దాడుల్లో దొరికారని టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. వీరికి గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను డీ ఎడిక్షన్ కేంద్రాలకు తరలించారు.

More Stories
చేనేత భారతీయ సంస్కృతి, స్వావలంబన, స్వభీమానం ప్రతీక
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు
రూ.1,240 కోట్లతో బళ్లారి- గుంతకల్లు రైల్వే ప్రాజెక్ట్