2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్రప్రభుత్వ మొత్తం అప్పు రూ.200.16 లక్షల కోట్లకు పెరుగుతుంది. రాజ్యసభలో సిపిఎం ఎంపి వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం పేర్కొంది. 2020-21లో మొత్తం కేంద్రం అప్పు రూ.121.86 లక్షల కోట్లు, ఇందులో రూ.115.71 లక్షల కోట్లు దేశీయ అప్పు, రూ.6.15 లక్షల కోట్లు విదేశీ అప్పు ఉంది.
2024-25లో కేంద్ర అప్పు రూ.177.20 లక్షల కోట్లు, దేశీయ అప్పు, రూ.8.74 లక్షల కోట్లు విదేశీ అప్పులు ఉన్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం, కేంద్రం అప్పు రూ.200.16 లక్షల కోట్లకు మరింత పెరుగు తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సమాధానంలో తెలిపింది. జూన్ 30, 2025 వరకు మాత్రమే కేంద్రం రూ.3.72 లక్షల కోట్ల కొత్త దేశీయ రుణాన్ని, రూ.0.23 లక్షల కోట్ల విదేశీ రుణాన్ని తీసుకుంది.
ఇటీవల సంవత్సరాల్లో వడ్డీ చెల్లింపులు కూడా పెరిగాయి. 2020-21లో రూ.6.80 లక్షల కోట్ల వడ్డీ చెల్లింపులు 2024-25లో రూ.11.16 లక్షల కోట్లకు పెరిగాయి. విడుదల చేసిన గణాంకాలు కేంద్ర ప్రభుత్వం ఆదాయ సేకరణను బలోపేతం చేయడానికి బదులుగా రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు చూపిస్తున్నాయి.

More Stories
అధిక లగేజీకి అదనపు రైల్వే చార్జీ
ఎగుమతుల్లో పుంజుకుంటున్న తమిళనాడు, తెలంగాణ
మావోస్టుల ఆర్ధిక మూలాలు కూడా దెబ్బతీశాం