అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చారని ఆరోపిస్తూ బీబీసీ సంస్థపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో బీబీసీ సంస్థకు వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కారు. 10 బిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ.90వేల కోట్లు) పరిహారం డిమాండ్ చేశారు. ఈ మేరకు మియామిలోని ఫెడరల్ కోర్టులో 33 పేజీలతో పిటిషన్ను దాఖలు చేశారు.
“ఉద్రిక్తతలను రెచ్చగొట్టే, దురుద్దేశపూరితంగా బీబీసీ నా ప్రసంగాన్ని ప్రసారం చేసింది. ఇది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి చేసిన బహిరంగ ప్రయత్నం. 2021 జనవరి 6న చేసిన శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన నా ప్రసంగాన్ని రెండుచోట్ల సవరించి ఉద్వేగభరితంగా మార్చింది. దాదాపు ఒక గంట వ్యత్యాసంతో చేసిన ప్రసంగంలోని భాగాలను ఒకటిగా కట్ చేసి చూపించారు” అని తెలిపారు.
“ఇది నా పరువుకు నష్టం కలిగించడమే కాకుండా ఫ్లోరిడా చట్టాలను ఉల్లఘించింది. అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోంది. ఈ రెండు ఆరోపణలపై ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి” అని ట్రంప్ పిటిషన్లో పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన పిలుపును ప్రసంగంలో తొలగించారని పిటిషన్ దాఖలు చేయడానికి ముందు ఓవల్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. జనవరి 6 గురించి చెప్పని భయంకరమైన పదాలను ఉపయోగించినట్లు ప్రసంగంలో వేశారని ఆరోపించారు. దేశభక్తి గురించి, మంచి విషయాల గురించి చెప్పిన మాటలను చూపించలేదని అన్నారు. బదులుగా భయంకరమైన మాటలను చూపించారని తెలిపారు.
ట్రంప్ 2021 జనవరి 6న ఓ ప్రసంగం చేశారు. అందులో అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఫైట్ లైక్ హెల్’ అని చెప్పారు. దీనిని తన పనోరమ డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసింది. డొనాల్డ్ ట్రంప్ హింసాత్మక చర్యలకు ప్రత్యక్షంగా పిలుపునిచ్చారు అనే తప్పుడు అభిప్రాయం కలిగేలా చేసింది. అందులో ఒక భాగంలో ‘క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదాం. ఘోరంగా పోరాడదాం’ అన్నట్లుగా ఉంది. దీనితో వివాదం చెలరేగింది.

More Stories
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలో భారత సంతతి మహిళ నిర్బంధం
హైదరాబాద్ నుండే ఆస్ట్రేలియా వెళ్లిన ఉగ్రవాది సాజిద్!