గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్ యజమానులు గౌరవ్, సౌరభ్ లూత్రాలకు ఎట్టకేలకు చుక్కెదురైంది. ప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి పారిపోయిన ఈ సోదరులను భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్‌లాండ్ పోలీసులు పట్టుకుని, మంగళవారం రోజు భారత్‌కు పంపించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్న వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే అక్కడకు గోవా పోలీసులు చేరుకున్నారు.
న్యాయప్రక్రియ అనంతరం వారిని గోవాకు తరలిసారు. ఈనెల 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత గోవాలోని అర్పోరాలోని ‘బిర్చ్ బై రోమియో’ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘోర ప్రమాదంలో 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే క్లబ్ యజమానులైన లూత్రా సోదరులు ఇండిగో విమానంలో థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు.
గోవా పోలీసులు వెంటనే వారిపై కేసు నమోదు చేసి పాస్‌పోర్టులను రద్దు చేశారు. అలాగే ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేశారు. దీంతో విదేశాలలో వారి ప్రయాణం ఆగిపోయింది. భారత అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు థాయ్‌లాండ్ పోలీసులు ఇటీవల లూత్రా సోదరులను ఫుకెట్ లో గుర్తించి అరెస్ట్ చేసారు. వారి గుర్తింపు, ప్రయాణ వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాత, అంటే మంగళవారం రోజు ఉదయం వారిని ఇండిగో విమానంలో భారత్‌కు డిపోర్ట్ చేశారు. ఈక్రమంలోనే మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న లూత్రా సోదరులను గోవా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.

More Stories
ఎపిలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ
రేణిగుంట, మదనపల్లెలలో వాజ్‌పేయీ కాంస్య విగ్రహాలు
ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై