జమ్మూ కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికగా మరోసారి పాకిస్థాన్ కు భారత్ చరుకలు వేసింది. తరచుగా పాక్ చేస్తున్న వాదలను ఆధారరహితమైనవిగా కొట్టివేసింది. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ గతంలోనూ, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ భారత్‌లో అంతర్భాగమే అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పునరుద్ఘాటించారు. అలాగే పాకిస్థాన్‌ను ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా పేర్కొన్నారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ను జైలుకి పంపి అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందంటూ ఎద్దేవా చేచారు. దీన్నిబట్టే ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
`శాంతికోసం నాయకత్వం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ ఆరోపణలు చేశారు. పాక్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది.
ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించడం భారత్ ప్రజలకు హాని కలిగించడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా ఉన్న దేశం, ప్రతి సమావేశంలోనూ తన విభజనాత్మక అజెండాను ముందుకు నెట్టి, భారత్‌పై ద్వేషాన్ని ప్రదర్శిస్తోందని పేర్కొంటూ ఇది తన అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చగలదని ఆశించడం అసాధ్యం అని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ దీర్ఘకాలంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం. అలాంటి దేశంతో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపవేయడం పూర్తిగా సముచిత నిర్ణయమే అవుతుందని హరీష్ తేల్చి చెప్పారు. 65 సంవత్సరాల క్రితం భారత్ సద్భావన, స్నేహ స్ఫూర్తితో ఈ ఒప్పందంలో చేరిందని, కానీ గత ఆరున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేల సంఖ్యలో ఉగ్రదాడులు నిర్వహిస్తూ ఈ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన విమర్సించారు.
గత నాలుగు దశాబ్దాల్లో పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదం , పది వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇటీలవ జరిగిన పహల్గాం ఘటనే పాకిస్థాన్ ఉగ్రవాదానికి నిరంతర మద్దతు ఇస్తోందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోందని హారిశ్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చిన భారత్ దాన్ని శక్తిమంతంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.
More Stories
హైదరాబాద్ నుండే ఆస్ట్రేలియా వెళ్లిన ఉగ్రవాది సాజిద్!
చనిపోతానని తెలిసినా తూటాలకు ఎదురెళ్లిన సిడ్నీ హీరో!
సిడ్నీ ఉగ్రదాడిలో పాక్ సంతతి తండ్రి, కొడుకులు