ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ, ప్రణాళిక, వేగంగా కచ్చితమైన నిర్ణయాలను అమలుచేయడం ద్వారా అసలైన దృఢత్వం లభిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ తామే విజయం సాధించామంటూ ఆ దేశం ప్రకటనలు చేసుకుంటోందని విమర్శించారు. బలహీన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయని, దానివల్ల తరచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులు కనిపిస్తుంటాయని అంటూ పొరుగు దేశంపై ధ్వజమెత్తారు.
భారతదేశానికి స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నదని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థలు భారత్‌కు బలమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను భారత బలగాలు అందిపుచ్చుకుంటున్నాయని అన్నారు. కొత్తగా విధుల్లోకి చేరనున్న యువ అధికారులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అలాగే దేశ సేవకు తమ పిల్లలను అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
“అదే సమయంలో భారత్ కు స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. భారత్ కు ఉన్న బలం సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థలు. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న మార్పులను భారత బలగాలు సమర్థవంతంగా అందిపుచ్చుకుంటున్నాయి” అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. భారతదేశ భవిష్యత్ పోరాట శక్తికి ‘జై’ అనే మూడు మూలస్తంభాలు అవసరం. అవి ‘సమిష్టితత్వం, ఆత్మనిర్భరత, ఆవిష్కరణ’- అని సీడీఎస్ తెలిపారు. అలాగే కొత్తగా విధుల్లోకి చేరనున్న యువ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. దేశ సేవకు తమ పిల్లల్ని అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా “ఆపరేషన్ సిందూర్ ముగియలేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మీరు (యువ అధికారులు) వైమానిక దళంలో చేరుతున్నారు. కనుక మీరు 24 గంటలు, 365 రోజులూ అలర్ట్‌గా ఉండాలి” అని సీడీఎస్ సూచించారు. “ఈ అకాడమీలో క్యాడెట్లకు అత్యుత్తమ శిక్షణ అందించారు. విధుల్లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఇక్కడ ఎవరు చేసే తప్పులకు వారే బాధ్యులు అవుతారు. ఒకప్పుడు యుద్ధాలు క్షేత్రస్థాయిలో మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీదే కీలకపాత్ర” అని తెలిపారు.

More Stories
కాంగ్రెస్ ప్రశ్నించిన వంటారాతోనే రేవంత్ ఒప్పందం!
దేశ నిర్మాణంలో క్రీడలు మార్గదర్శక శక్తిగా నిలవాలి
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా