దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 7వ రోజు కొనసాగుతున్న ఈ సంక్షోభం కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా 400కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయిలలో విమాన సర్వీసులు ఆగిపోయాయి.
ఇక ఈ సంక్షోభం వేళ ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ల ధరలు కూడా కుప్పకూలాయి. సోమవారం ప్రారంభం నుంచి ఆ సంస్థ షేర్ల ధర 7 శాతం పడిపోయింది. 10 గంటలకు షేర్ల ధర రూ.5,160 వద్ద ఉన్నప్పటికీ, గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 9 శాతం నష్టాన్ని చవిచూసింది.ఈ నెల ప్రారంభం నుంచి 15 శాతం మేర షేర్లు పడిపోయాయి.
ఇండిగో విమానాల రద్దుపై న్యాయ జోక్యం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పరిస్థితులను గమనించి, దానిని పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుందని పేర్కొంది. లక్షలాది మంది వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారనే వాస్తవాన్ని తాము గమనించామని సుప్రీంకోర్టు తెలిపింది.
‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. లక్షలాది మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకుని ఈ సమస్యను గుర్తించిందని మాకు తెలుసు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ముఖ్యమైన సమస్యలు ఉంటాయని తెలుసు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కాగా, గత ఆరు రోజులుగా ఇండిగో సంస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. రోజూ వందలాది విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో దిక్కుతోచని స్థితితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
దేశంలోని 95 విమానాశ్రయాల్లో సుమారు 2500 విమానాలు ఆలస్యం అయ్యాయని, దీన్ని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. 7వ రోజు కొనసాగుతున్న ఈ సంక్షోభం కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా 400కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయిలలో విమాన సర్వీసులు ఆగిపోయాయి.
కాగా, ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణను వేగవంతం చేసింది. శనివారం 1,500, ఆదివారం 1,650 విమానాలు నడిపింది. 138 గమ్యస్థానాలలో 135కి కనెక్టివిటీని పునరుద్ధరించింది. అలాగే ప్రయాణికులకు రూ.610 కోట్ల భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ప్రభావిత ప్రయాణికులకు సుమారు 3,000 సామగ్రిని ఇండిగో తిరిగి ఇచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
More Stories
ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం
ఆదివారం రాత్రిలోగా రీఫండ్ చేయాలి
భారత్‌కు 40వేల ఇజ్రాయెల్ లైట్ మెషీన్ గన్స్