నేడు ఇళ్లలో మాతృభాష మరియు సంస్కృతం వాడకం తగ్గడం పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు భారతీయ భాషను ఆంగ్లంలోకి అనువదించడం, భారతీయ భాష సారాన్ని ఆంగ్లంలో సంగ్రహించడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో సాధువు జ్ఞానేశ్వర్ రాసిన జ్ఞానేశ్వరి ఆంగ్ల అనువాదం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంగ్ల అనువాద సంపాదకులు డాక్టర్ సురేంద్ర, డి. సూర్యవంశీ, డాక్టర్ తుకారాం బి. గరుడ్, డాక్టర్ (శ్రీమతి) మీరా టి. గరుడ్ కూడా హాజరయ్యారు.
“పాసాయదాన్,” “చల కల్పతరుచే ఆరవ్, చేతనాచింతామినించే గావ్” నుండి ఒక పద్యం ఆంగ్ల అనువాదాన్ని డా. భగవత్ ఉదాహరణగా చూపుతూ “కల్పతరు”, “చేతన చింతామణి” లకు ఆంగ్ల పదాలు లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా, “ధర్మ”, “రాష్ట్ర” లకు కూడా ఆంగ్లపదాలు లేవని చెప్పారు. అందువల్ల, మూల పదాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరం అని, అప్పుడే దాని సారాంశాన్ని అర్థం చేసుకోగలమని తెలిపారు.
భక్తి అనేది మానవులను విశ్వంతో కలిపే ఆధ్యాత్మిక సత్యం అని భగవత్ చెప్పారు. భక్తి లేకుండా జ్ఞానం, క్రియ ఉన్నత స్థితికి చేరుకోలేవని, భక్తి లేని చర్య ఒక అస్తవ్యస్తమైన చర్య అని స్పష్టం చేశారు. కాబట్టి, జ్ఞానం, క్రియ భక్తిపై ఆధారపడి ఉండాలని ఆయన సూచించారు. భక్తి ఒక పక్షి అయితే, దాని రెక్కలలో ఒకటి జ్ఞానం, మరొకటి చర్య అని, అంతిమ స్థానం భక్తి, జ్ఞానం, చర్యల కలయిక ద్వారా మాత్రమే లభిస్తుందని వివరించారు.
భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని కలిగి ఉందని భగవత్ చెప్పారు. కానీ ఇక్కడ, అనేకం ఒకదాని నుండి సృష్టించబడ్డాయని, ఒకటి వివిధ రూపాల్లో వ్యక్తమైందని, కాబట్టి, ఇది ‘ఐక్యత వైవిధ్యం’ అని ఆయన తెలిపారు. ఒక చెట్టు అన్ని ఆకులు ఒకే ఆకారం లేదా రంగులో ఉండవని, అయినప్పటికీ దానిని చూడటం ద్వారా ఒక ఆకు ఏ చెట్టుకు చెందినదో మనం చెప్పగలం అని పేర్కొంటూ ఇది ఐక్యత అనుభవం అని వివరించారు.
తరతరాలుగా, భారతదేశ ఋషులు మరియు సాధువులు సమాజంలోని ప్రతి వ్యక్తికి మొత్తం విశ్వం దేవుని అభివ్యక్తి అని, అంటే ప్రతిదీ దేవుడే అని సందేశాన్ని అందించారని డా. భగవత్ తెలిపారు. దైవత్వం వివిధ రూపాల్లో వ్యక్తమైందని, సజీవమైన, నిర్జీవమైన అన్ని జీవులు పరస్పరం అనుసంధానించబడి, పరిపూరకంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
దేవుడు ఒక్కరా లేదా అనేకమా అని మనం చర్చించమని, బదులుగా, ప్రతిదీ దైవమె అని మనం నమ్ముతామని ఆయన గుర్తు చేశారు. అందుకే తల్లులు తమ పిల్లలకు రాత్రిపూట చెట్లను తాకవద్దని చెబుతారని, ఎందుకంటే చెట్లు నిద్రపోతున్నాయని తెలిపారు. మన సంస్కృతి చెట్లలో కూడా దైవత్వాన్ని చూడమని నేర్పిందని పేర్కొంటూ భక్తి లేకుండా దేవుడిని కనుగొనలేమని ఆయన స్పష్టం చేశారు.
“కాబట్టి, మనం సాన్నిహిత్యాన్ని పాటించాలి. మనం మానవత్వం, సమాజం, సృష్టి. దేవునితో ఒకటిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మన స్వంతం. మనం ప్రతి ఒక్కరినీ మనతో తీసుకెళ్లాలి.ఈ స్ఫూర్తితో మనం జీవించాలి. మన ఆలోచనలు అనుభవపూర్వకమైనవి” అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
సృష్టి ప్రారంభం నుండి కాలాంతం వరకు ఆలోచనలు, అంటే, గతం, వర్తమానం, భవిష్యత్తు గురించిన జ్ఞానం శ్రీమద్ భగవద్గీతలో ఉన్నాయని ఆయన తెలిపారు. “అన్ని ఉపనిషత్తుల జ్ఞానం గీత. మన భక్తులు జ్ఞానవంతులు, కష్టపడి పనిచేసేవారు. కాబట్టి, సమాజంలో అద్భుతమైన క్రమం ఉంది. నేడు, మనం ఈ ఆదర్శానికి అనుగుణంగా జీవించాలి. మన ప్రవర్తన మన స్వంత పురోగతి కోసం, మన కుటుంబాల , మన తరాల శ్రేయస్సు కోసం. విశ్వం ప్రయోజనం కోసం ఉండాలని మనం కోరుకోవాలి” అని డా. భగవత్ సూచించారు.

More Stories
నా జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు.. కుమారుని పేరు శేఖర్
శ్రీ భూమి కథ- నా అనుభవం
కాంగ్రెస్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లను విస్మరించింది