“రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఇరుదేశాలకు ముఖ్యమైంది. రష్యా- భారత్ సంబంధాలపై కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు రాజకీయ, వాణిజ్య, శాస్త్రసాంకేతిక, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై సమగ్రంపై చర్చించనున్నారు. ఇంకా వీటితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైన చర్చించనున్నారు. అన్ని కీలక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బృందంతో పుతిన్ చర్చలు జరపనున్నారు” అని రష్యా అధికార మీడియా పేర్కొంది.
2021 తర్వాత పుతిన్ భారత్‌కు మళ్లీ ఇప్పుడే వస్తున్నారు. గతేడాది ప్రధాని మోదీ, పుతిన్ రెండుసార్లు భేటీ అయ్యారు. 2024 జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. ఆ సందర్భంలో ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అందుకున్నారు.
అదే ఏడాది అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్‌లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఇక, ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్-మోదీ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) దేశాధినేతల మండలి సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు.
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సన్నిహితుడు నికోలాయ్ పాత్రుషేవ్ కూడా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఆ సమయంలో చర్చించారు.

More Stories
అమరావతిలో 25 బ్యాంకులకు శంకుస్థాపన
కేరళ కాంగ్రెస్ ఎమ్యెల్యేపై లైంగిక వేధింపుల కేసు
బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ పై పట్టుకోసం బిజెపి