నవంబర్ 26, 2008న ముంబైలో మారణకాండ నరమేధం. .బరితెగించిన ఉగ్రమూక దేశ ఆర్థిక రాజధానిని తూటాలతో తూట్లు పడేలా చేసింది. ఎన్నో కుటుంబాలను చిద్రం చేసింది. నేటికీ మానని గాయాలతో నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు నాడు అమరులైన వారి కుటుంబాలు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడితో భారతదేశం చిగురుటాకులా వణికిపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రదాడి ని తీవ్రంగా ఖండించాయి.
రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ లో చొరబడి ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. చత్రపతి శివాజీ టెర్మినస్ తో పాటు 12 చోట్ల ముష్కరుల దాడి. 166 మంది బలి చత్రపతి శివాజీ టెర్మినస్ తో పాటు 12 చోట్ల ముష్కరుల దాడి. 166 మంది బలి. ఏకే 47 తుపాకులని ఎక్కుపెట్టి జరిపిన కాల్పుల్లో 58 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఊహించని దాడికి ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.
అక్కడి నుండి వీధుల్లోకి వెళ్లి న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. నారీమన్ లైట్ హౌస్, ఒబెరాయ్ ట్రైడెంట్, కామా హాస్పిటల్,తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల దాడులతో ముంబై నగరం భీతిల్లి పోయింది. దాదాపు అరవై గంటల పాటు సాగిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో అమాయక ప్రజలు క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.
ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లోని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ ఖాన్ తదితరులు అమరులయ్యారు. చిద్రమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో, మిన్నంటిన బంధువుల రోదనలతో ముంబై నగరం నాటి మారణకాండను నేటికీ మరచిపోలేకపోతుంది.
లష్కరే తోయిబాకు చెందిన పది మందిలో తొమ్మిది మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఇక ఈ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో కసబ్ కు ఉరి శిక్ష విధించడంతో అతన్ని ఉరి తీశారు. అయితే, 17 ఏళ్లయినా ఈ ఉగ్రదాడికి దారితీసిన భద్రతా వైఫల్యాలు, స్థానికంగా ఉగ్రవాదులకు అండదండలు అందించిన వారి గురించిన దర్యాప్తు జరపకుండా దారితప్పించారు.
కేవలం సముద్రంలో బోటులలో పాకిస్థాన్ నుండి వచ్చి వారు ఇంతటి భీకర ఉగ్రదాడి ముంబైలో జరిపారని చెప్పలేము. వారికి స్థానికంగా ఎవ్వరు తగిన సదుపాయాలు సమకూర్చారో ఇప్పటివరకు కనుక్కొనే ప్రయత్నం జారగానే లేదు. ఘటన ప్రారంభం కాగానే ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఢిల్లీ నుండి ఓ ప్రత్యేక విమానంలో ఎస్పీజీ బృందం బయలుదేరినా భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ తాను కూడా వారితో వస్తానని సుమారు మూడు గంటలసేపు ఢిల్లీ విమానాశ్రయంలోనే వారు ఎదురుచూసే పరిస్థితి కల్పించిన నాటి హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్ గురించి దర్యాప్తు జరగానే లేదు.
పైగా, ఆ విమానం తెల్లవారు జామున 2 గంటల లోపే ముంబై విమానాశ్రయంకు చేరుకున్నా ప్రోటోకాల్ ప్రకారం తనకు స్వాగతం చెప్పేందుకు మహారాష్ట్ర మంత్రులు రాలేదంటూ, వారిచ్చే వరకు మరో మూడు గంటల వరకు ఆ విమానం తలుపులు తెరవనీయలేదు. ఆపరేషన్ సమయంలో సివిల్ అధికారులు వారితో ప్రయాణించడం సాధ్యం కాదు.
కానీ, నాటి హోంమంత్రి కోసం ఆ రాత్రి అంతా ఎస్పీజీ దళాలు ఆపరేషన్ ప్రారంభించలేక పోయాయి. వారు బయలుదేరగానే, ముందు రోజు రాత్రే ముంబై చేరుకొని ఉంటె మృతుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేదని భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పాకిస్థాన్ ప్రమేయంతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం అవుతున్నా నాడు అమెరికా ఒత్తిడి కారణంగా భారత్ ప్రతీకార దాడి జరపలేక పోయిందని తాజాగా ఆ తర్వాత హోంమంత్రి పదవి చేపట్టిన చిదంబరం బహిరంగ పరిచారు. ఇటువంటి దారుణమైన దాడికి నాటి రాజకీయ నాయకత్వం స్పందన సిగ్గుచేటుగా, దేశ విద్రోహకరంగా ఉందని చెప్పక తప్పదు.

More Stories
శతాబ్దాలుగా మార్గం ఏర్పర్చిన గురు తేజ్ బహదూర్ బలిదానం
ఎస్ఐఆర్ పై బిజెపి దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం
ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్య!