“గతేడాది 83,000 మంది మహిళలు, బాలికలు ఉద్దేశపూర్వకంగా హత్యకు గురయ్యారు. అందులో 60 శాతం అంటే 50,000 మంది మహిళలు, బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారు. దీని అర్థం దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక భాగస్వామి వారి కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోంది” అని తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ బ్రాండోలినో తెలిపారు.
దాదాపు సగటున ప్రతిరోజూ 137 మంది మరణిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు, బాలికలకు ఇల్లు ప్రమాదకరమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ప్రదేశంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మహిళలపై ఆన్లైన్ హింస ముప్పును ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం డైరెక్టర్ సారా హెండ్రిక్స్ ప్రస్తావించారు. డిజిటల్ హింస ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండదని, అది ఆఫ్లైన్లోనూ వ్యాపిస్తుందని అభిప్రాయపడ్డారు.
అటు గతేడాది 11 శాతం పురుష హత్యలు సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యులతో జరిగాయని నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలోనే మహిళ హత్యకు వ్యతిరేకంగా మెరుగైన నివారణ చర్యలు, న్యాయం అందిచేలా చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. ఇవి తీవ్రమైన హింసను వ్యాప్తి చేసే పరిస్థితులకు కారణమవుతాయని హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో మహిళలు, బాలికలు తీవ్రమైన హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడి చేతిలో ఎక్కువగా హత్యకు గరవుతున్నారు. మహిళా హత్య రేటులో ప్రపంచంలో ప్రతి లక్ష మందిలో అత్యధికంగా ఆఫ్రికాలో (3), అమెరికాలో (1.5), ఓషియానియా (1.4), ఆసియా (0.7), యూరప్ (0.5)లో జరుగుతున్నాయని అంచనా వేశారు.
ఇంకా బయటి వ్యక్తుల వల్ల కూడా మహిళ, బాలిక హత్యలు జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించిన డేటా పరిమితంగానే ఉందని తెలిపారు. 2024లో ప్రైవేట్ రంగంలో దాదాపు 50,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. అంతకుముందు 2023లో ఈ సంఖ్య 51,100గా ఉంది.

More Stories
ఎస్ఐఆర్ పై బిజెపి దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం
వర్కింగ్ జర్నలిస్టులుగా డిజిటల్, టీవీ, రేడియో పాత్రికేయులు
విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ‘ముస్లిం బ్రదర్హుడ్’