“మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహె పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ఉరుమి అనే ఆయుధాన్ని ఏర్పాటు చేశారు.ఇది కలరిపయట్టులో ఉపయోగించే పొడవైన, సన్నని కత్తి. చురుకుదనం, కచ్చితత్వం, యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్ఠం కానుంది” అని జనరల్ ఉపేంద్ర తెలిపారు.
“జలాంతర్గాములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించేలా ఐఎన్ఎస్ మాహెను అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ జలాంతర్గామి పాల్గోనుంది” అని చెప్పారు. ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్‌క్రాఫ్ట్ నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. శత్రు జలాంతర్గాములు దీని రాకను గుర్తించలేవు. అందుకే దీన్ని సైలెంట్ హంటర్‌గా పిలుస్తారు.
ఇందులోని సోనార్ సిస్టమ్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. శత్రు జలాంతర్గాములు, మైన్స్, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు అత్యంత కీలకం. డీఆర్డీఓ అభివృద్ది చేసిన అభయ్ హల్-మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు. తద్వారా నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే అవకాశం ఉంటుంది. జలాంతర్గాముల శబ్ధాలు, వాటి కదలిలకను ఇది వేగంగా గుర్తిస్తుంది.
ఇందులోని ‘లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్’ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలి వరకు నిఘా పెట్టే అవకాశం ఉంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్ర ముప్పును పసిగడుతూ ఉంటుంది.

More Stories
మతం కోసం ఎలా జీవించాలో చూపించిన గురు తేజ్ బహదూర్
లొంగుబాటుకు సమయం కోరిన మావోయిస్టులు
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత