యువత కోసం ఆధునిక సేవలను అందించే దిశగా పోస్టల్ విభాగం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో జెన్-జెడ్ థీమ్‌తో పోస్టాఫీస్‌లను తీసుకొచ్చింది. ఢిల్లీలో రెండు పోస్టాఫీసులను ప్రారంభించారు. మొదటి జెన్-జెడ్ పోస్టాఫీసును నవంబర్ 19న ఐఐటీ ఢిల్లీలో ప్రారంభించారు. నవంబర్ 20న ఢిల్లీ యూనివర్సిటీలో మరొక పోస్టాఫీసును ప్రారంభించారు.
పోస్టల్ విభాగం కేవలం ఉత్తరాలను పంపించడానికే కాకుండా నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా వివిధ సేవలు అందించే కేంద్రంగా మార్పు చెందిందని యువతకు చూపించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది జనవరి నాటికి మొత్తం 46 విద్యా సంస్థల్లో ఉన్న పోస్టాఫీసులను జెన్-జెడ్ పోస్టాఫీసులుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ జెన్-జెడ్ పోస్టాఫీసు కేవలం పార్శిల్స్, ఉత్తరాలు పంపించడంతో పాటు సోషల్ లెర్నింగ్ స్పేస్‌గా రూపొందించారు. విద్యార్థులు ఇక్కడ ఉచితంగా వైఫైను వినియోగించుకోవచ్చు. అలాగే పుస్తకాలు చుదువుకునే ఓ లైబ్రెరీగా ఉంటుంది. అంతేకాకుండా సౌకర్యవంతంగా కూర్చొని ఆర్ట్ ప్రదర్శనలను వీక్షించవచ్చు.
క్యాంపస్‌లో విద్యార్థులు, పరిశోధకులు, స్థానిక నివాసితులు స్వేచ్ఛగా సమయం గడపడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఇంటరాక్షన్ జోన్‌గా ఉంటుంది. ఈ పోస్టాఫీసుల్లో క్యూఆర్-ఆధారిత పార్శిల్ బుకింగ్, విద్యార్థులకు అనుకూలమైన స్పీడ్ పోస్ట్ డిస్కౌంట్లతో సహా స్మార్ట్ సర్వీసులు ఉన్నాయి.
చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది.
విద్యార్థులతో పాటు సాధారణ పాఠకులు కూడా ఆకర్షించే విధాంగా వివిధ రకాల పుస్తకాలు, మ్యాగ్జైన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జెన్-జెడ్ పోస్టాఫీసులో ఆర్ట్ కార్నర్ కూడా ఉంటుంది. అందులో విద్యార్థులు రూపొందించిన చిత్రాలు, స్కెచ్‌లు, ఫొటోగ్రాఫ్‌లను ప్రదర్శిస్తుంది. దీంతో యువ కళాకారులను ప్రోత్సహించేందుకు ఒక వేదిక అందించడంతో పాటు క్యాంపస్‌లో సృజనాత్మక వాతావరణాన్ని పెంచుతుంది.
విద్యాలయాలను శక్తివంతమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చొరవను ఇది ప్రతిబింబిస్తుందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పోస్టాఫీసులు విద్యార్థులకు ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. చాలా మంది విద్యార్థులకు పోస్టల్ విభాగం అందించే పూర్తి స్థాయి ఆర్థిక, కమ్యూనికేషన్ సేవలపై అవగాహన లేదని అర్చన శర్మ తెలిపారు.
అందుకోసమే ఈ ఆధునిక సేవల కూడిన పోస్టల్ వ్వవస్థను తీసుకొస్తున్నామని చెప్పారు. స్పీడ్ పోస్టు, పార్సిల్ సేవలు, ఇంటర్నేషనల్ ఆర్టికల్ బుకింగ్, సేవింగ్స్ అకౌంట్లు, రెకరింగ్ డిపాజిట్ (ఆర్ డి), ఎంఐఎస్, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ అకౌంట్లు, మరెన్నో పోస్టల్ పథకాలు గురించి తెలియజేస్తున్నామని తెలిపారు.

More Stories
అమెరికా ఆంక్షలతో చమురు అమ్మకాలు ఆపేసిన రిలయన్స్
అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్