13 రోజుల పాటు ఈడీ క‌స్ట‌డీలో అల్ ఫ‌లాహ గ్రూపు చైర్మెన్

13 రోజుల పాటు ఈడీ క‌స్ట‌డీలో అల్ ఫ‌లాహ గ్రూపు చైర్మెన్
* ఉగ్రవాద కుట్రలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిన యూనివర్సిటీ!
ఢిల్లీ బాంబు పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఇన్‌చార్జ్, అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ స్థాపకుడు జవాద్ సిద్ధిఖీని 13 రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.   అల్ ఫ‌లాహ్ ఛారిట‌బుల్ ట్ర‌స్టు మ‌నీల్యాండ‌రింగ్ కేసులో మంగళవారం  అరెస్ట్ చేసిన అల్ ఫ‌లాహ్ గ్రూపు చైర్మెన్ జావ‌ద్ అహ్మ‌ద్ సిద్ధిక్ ను  సిటీ కోర్టు ముందు హాజరు పరిచి డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు ఈడీ క‌స్ట‌డీలోకి తీసుకున్న‌ది. 
 
అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జీ షీత‌ల్ చౌద‌రీ ప్ర‌ధాన్ బుధ‌వారం రాత్రి ఒంటి గంట‌కు ప్ర‌త్యేక ఆదేశాలు జారీ చేశారు.  ఎంపీఎల్ఏ చ‌ట్టంలో సెక్ష‌న్ 19 కింద సిద్ధిక్‌ను అరెస్టు చేశారు. అల్ ఫ‌లాహ్ గ్రూపుపై విచార‌ణ చేప‌ట్టిన త‌ర్వాత ఈడీ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏజెన్సీ చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది.
 
 హర్యానాలోని భూపేంద్ర హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఈ విశ్వవిద్యాలయానికి అనుమతి ఇచ్చింది, నియమాలు, చట్టాలు,  రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా, ఫరీదాబాద్‌లోని 60 ఎకరాల విలువైన భూమిని మధ్యప్రదేశ్‌లో మోసం చేసి పారిపోయిన మోసగాడు  అయిన జవాద్ అహ్మద్ సిద్ధిఖీకి కేవలం రూ. 100కి ఇచ్చింది. ఇది మాత్రమే కాదు, హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ అభివృద్ధి పథకం కింద ఇక్కడ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి  రూ. 60 కోట్లు కూడా కేటాయించింది.
 
ఫ‌రీదాబాద్‌లోని అల్ ఫ‌లాహ్ కాలేజీ విద్యార్థుల‌ను, పేరెంట్స్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు గుర్తించారు.  ఎన్ఏఏసీ అక్రిడిటేష‌న్ ఉన్న‌ట్లు నమ్మించార‌ని ఆరోపించారు. 1956 యూజీసీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 12(బీ) కింద‌ యూజీసీ అనుమ‌తి ఉన్న‌ట్లు కూడా ఆ యూనివ‌ర్సిటీ త‌ప్పుగా చూపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌రారీ అయ్యే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో అత‌న్ని క‌స్ట‌డీలోకి తీసుకుంటున్న‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది. 1990 నుంచి అల్ ఫ‌లాహ్ వ‌ర్సిటీ అంచ‌లంచెలుగా ఎదిగింద‌ని, ఇప్పుడు ఓ పెద్ద విద్యాసంస్థ‌గా మారిన‌ట్లు తెలిపింది.
కాగా, అల్ ఫ‌లాహ్  గ్రూపు చైర్మ‌న్ జావ‌ద్ అహ్మ‌ద్ సిద్ధిక్‌కు విరాళాల రూపంలో 415 కోట్లు అందిన‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది. త‌న ట్ర‌స్టుకు చెందిన విద్యాసంస్థ‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల నుంచి అక్ర‌మ రీతిలో ఆ నిధులను స‌మీక‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌ల్ఫ్‌లో ఫ్యామిలీ స‌భ్యులు స్థిర‌ప‌డ‌డం వ‌ల్ల అక్క‌డికి పారిపోయే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలిసింది. ఫ‌రీదాబాద్‌లో రోజంతా జ‌రిగిన త‌నిఖీల త‌ర్వాత అల్ ఫ‌లాహ్ వ‌ర్సిటీ గ్రూపు చైర్మ‌న్ సిద్దిక్‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.