`టెక్ శంకర్’తో సహా మరో ఏడుగురు మావోయిస్టులు హ‌తం!

`టెక్ శంకర్’తో సహా మరో ఏడుగురు మావోయిస్టులు హ‌తం!
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మ‌రోసారి తుపాకులు గ‌ర్జించాయి. తూటాల వ‌ర్షం కురిసింది. పోలీసులు – మావోయిస్టుల‌కు మ‌ధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ మ‌హేశ్ చంద్రా ల‌డ్డా తెలిపారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున బీఎం వ‌ల‌స వ‌ద్ద కాల్పులు జ‌రిగిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.
 
మావోయిస్టు ఐఈడీ నిపుణుడు మెట్టూరు జోగారావు, అలియాస్ టెక్ శంకర్ మరణించిన ఏడుగురు మావోయిస్టులలో ఒకరు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీతో చాలా కాలంగా సంబంధం కలిగి ఉన్న టెక్ శంకర్, అధునాతన పేలుడు పరికరాలను సమీకరించడంలో తన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. మావోయిస్టులు మోహరించిన అనేక పేలుడు పదార్ధాలను అభివృద్ధి చేయడంలో అతను పాల్గొన్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
 
వీరిలో నలుగురు పురుషులు, ముగ్గరు మహిళలు ఉన్నారన్నారు. మృతుల‌ను మావోయిస్టులు జోగారావు అలియాస్ టెక్ శంక‌ర్, సీత అలియాస్ జ్యోతి, సురేశ్, గ‌ణేశ్‌, వాసు, అనిత‌, ష‌మ్మిగా పోలీసులు గుర్తించారు.  నిన్న ప‌ట్టుబ‌డ్డ 50 మంది మావోయిస్టుల‌ను ఇవాళ విజ‌య‌వాడ‌లో మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు.  మారేడుమిల్లిలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఎన్‌కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. 

ఇక ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ‌, కోన‌సీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టుల‌ను అరెస్టు చేశామ‌నిచెప్పా రు. వీరిలో స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ మెంబ‌ర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబ‌ర్లు 23 మంది, డివిజిన‌ల్ క‌మిటీ మెంబ‌ర్లు ఐదుగురు, ఏరియా క‌మిటీ మెంబ‌ర్స్ 19 మంది ఉన్న‌ట్లు తెలిపారు. ప‌ట్టుబ‌డ్డ మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు.

‘‘ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నాం. నవంబరు 17న ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు” అని తెలిపారు. 
 
“మరోవైపు ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశాం. వీరిలో స్పెషల్ జోనల్‌ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్‌ మెంబర్లు 23 మంది, డివిజినల్‌ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నారు” అని వివరించారు. 

మరోవైపు పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు , కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు. ఇప్పటికే 5 జిల్లాల ఎస్పీలు ,రేంజ్ ఐజీలు కమాండ్ రూమ్‌కు చేరుకున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు ,మొబైల్స్, సిమ్ కార్డులు,పెన్ డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు.

.