అవినీతికి వ్యతిరేకంగా దద్దరిల్లిన ఫిలిప్పీన్స్‌ రాజధాని

అవినీతికి వ్యతిరేకంగా దద్దరిల్లిన ఫిలిప్పీన్స్‌ రాజధాని
 
జనరేషన్‌ జెడ్‌(జెన్‌జీ) నిరసనలు మెక్సికోకూ పాకాయి. ప్రాజెక్టుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా దద్దరిల్లింది. వేలాది మంది ఆందోళనాకారులు రోడ్డెక్కారు. ఈ భారీ అవినీతి విషయంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  ఇగ్లీసియా ఎన్‌ఐ క్రిస్టో ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల ర్యాలీ శనివారం ప్రారంభమైంది. దాదాపు 27వేల మంది మనీలాలోని రిజాల్‌ పార్క్‌లో గుమిగూడారు.
దేశంలోని హింస, అవినీతితో విసిగిపోయిన వేలాది మంది యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. శనివారం మెక్సికోలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  ఫ్లడ్‌ కంట్రోల్‌ పేరిట నకిలీ ప్రాజెక్టులు చేపట్టారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాణాలనూ పాటించలేదని ఆరోపించారు. ఈ నిరసనలో ప్రధానంగా ప్రభుత్య పర్యవేక్షణను కోరారు. వరద-నియంత్రణ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆందోళనాకారులు ఆరోపించారు.
ప్రాజెక్టులను దక్కించుకోవడం కోసం రాజకీయ నాయకులు, అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కంపెనీలు ప్రయత్నించాయనీ, ఇందులో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. ఈ కుంభకోణంలో ప్రధానంగా పలువురు ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, వ్యాపారవేత్తల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్‌ మాట్లాడుతూ  దోషులు క్రిస్మస్‌కు ముందే జైలులో ఉంటారని హెచ్చరించారు. 
అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ ఇప్పటికే 37 మందిపై అవినీతి కేసులు పెట్టగా 86 మంది కాంట్రాక్టర్లపై భారీ పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి.
‘మాకు మరింత భద్రత కావాలి’ అని ఈ సందర్భంగా అండ్రెస్‌ మస్సా(29) అనే బిజినెస్‌ కన్సల్టెంట్‌ మీడియాతో చెప్పారు. దేశంలో ప్రజాదరణ పొందిన ఉరుయాపన్‌ మేయర్‌ కార్లొస్‌ మాంజో ఇటీవల హత్యకు గురి కావడంపై యువతరం ఆందోళన వ్యక్తం చేసింది.
 
మెక్సికో సిటీలో జరిగిన ర్యాలీలో కొందరు నిరసనకారులు మాట్లాడుతూ నేరాలు, హింసను అదుపు చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘కార్లొస్‌ చనిపోలేదు, ప్రభుత్వమే ఆయనను చంపింది’ అని వారు నినదించారు. ఈ హత్యను నిరసిస్తూ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ నివసించే నేషనల్‌ ప్యాలెస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని నిలువరించారు. నిరసనకారుల వెనక అతివాద రాజకీయ పార్టీలు ఉన్నాయని క్లాడియా ఆరోపించారు.