దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యత సూచిక 400కిపైనే నమోదవుతోంది. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. దీంతో రాజధాని వాసులు శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతను తట్టుకోవడానికి మాస్కులు కూడా సరిపోవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాదులను వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని సూచించింది.
వర్చువల్‌గా హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ మీరు ఎందుకు భౌతికంగా కోర్టు కార్యకలాపాలకు హాజరువుతున్నారని సీనియర్ న్యాయవాదులను జస్టిస్ పీఎస్ నరసింహ ప్రశ్నించారు. ‘మీకు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యే సౌకర్యం ఉంది. అయినా ఎందుకు వస్తున్నారు..? దాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలుష్యం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది’ అని అన్నారు. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని జస్టిస్ పిఎస్ నరసింహ తెలిపారు.

More Stories
అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!
ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు!