సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంభం గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో సోషల్మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదని అని పేర్కొన్నారు. నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు.
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం గమనార్హం.
“నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, దానికి నేను చింతిస్తున్నాను. నాగార్జున గారిని లేదా వారి కుటుంబ సభ్యులను కించపరచాలనే లేదా అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనల వల్ల ఏదైనా అపార్థం కలిగితే దానికి నేను చింతిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను” అని మంత్రి కొండా సురేఖ ట్వీట్లో పేర్కొన్నారు.

More Stories
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!
దక్షిణాది సీఎంలకు ముడుపులు భరించలేకనే విశాఖకు అదానీ!
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత