బెంగుళూరులోని కెంపగౌడ విమానాశ్రయంలో ఓ ముస్లింల బృందం నమాజ్ చేసిన ఘటన వివాదాస్పదం అవుతున్నది. కర్నాటక రాష్ట్ర బీజేపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. కెంపగౌడ విమానాశ్రయంలోని టర్మినల్-2లో ఈ ఘటన చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఓ గ్రూపు నమాజ్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న సెక్యూర్టీ సిబ్బంది నిశ్చేష్టులిగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. హై సెక్యూర్టీ ఉన్న ఎయిర్పోర్టులో ఎలా ఇలాంటి ఘటన జరిగిందో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే వివరణ ఇవ్వాలని బీజేపీ ప్రతినిధి విజయ ప్రసాద్ డిమాండ్ చేశారు.
హై సెక్యూర్టీ జోన్లో నమాజ్ చేయడానికి ముందు అనుమతి తీసుకున్నారా లేదా? అని బీజేపీ నేత ప్రశ్నించారు. అనుమతి తీసుకుని ఆర్ఎస్ఎస్ పద్ సంచాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రభుత్వం వ్యతిరేకించిందని, కానీ నిషేధి ప్రాంతాల్లో ప్రార్థనలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకున్నదని ఆయన అడిగారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. టర్మినల్ 2 వద్ద భారీ సెక్యూర్టీ ఉంటుందని, కానీ పోలీసులు ఆ గ్రూపును అడ్డుకోలేకపోయారని, ఓ వర్గం పట్ల ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.

More Stories
ఢిల్లీ నగరాన్ని కప్పేసిన పొగమంచు
భారత్ లో ఉగ్రవాదం వెనుక పాక్ ఐఎస్ఐ సీక్రెట్ యూనిట్ ‘ఎస్1’
బీహార్ లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు!