పాతబస్తీలో హిందూ మైనర్ అమ్మాయిలపై డ్రగ్స్ రాకెట్ పంజా

పాతబస్తీలో హిందూ మైనర్ అమ్మాయిలపై డ్రగ్స్ రాకెట్ పంజా
* రేవంత్ పట్టించుకోకపోతే హిందూ రక్షక దళాలను, కేంద్ర బలగాలను దింపుతాం.. సంజయ్ హెచ్చరిక

పాతబస్తీలో మజ్లిస్ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిలను  టార్గెట్ చేసి కిడ్నాప్, అత్యాచారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పాతబస్తీ పోలీసులు కనీసం విచారణ జరపడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్ కు ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వ్యవహిస్తోందని విమర్శించారు. 
 
పాతబస్తీలోని హిందు అమ్మాయిలు అత్యధికంగా చదువుకునే స్కూల్ టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠా అరాచకాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.  తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ద ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూసి మైనర్ బాలికల జీవితాలను కాపాడకపోతే పాతబస్తీలో వేలాది మంది హిందు యువకులతో రక్షక దళాలలను రంగంలోకి దింపుతామని ఆయన హెచ్చరించారు. 
 
అవసరమైతే చట్టానిక లోబడి కేంద్ర దళాలలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  పాతబస్తీలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కేరళ ఫైల్స్ సినిమాను తలపిస్తోందని తెలిపారు. మొదట ఈ రాకెట్ ఆ స్కూల్ లో ఒక అమ్మాయిని టార్గెట్ చేసి బర్త్ డే పేరుతో ముస్లిం అమ్మాయి ఇంటికి పిలిపించి తక్కువ డ్రగ్స్ డోసు ఉన్న చాక్లెట్ తిన్పించారని,  ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ చాక్లెట్లలో డ్రగ్స్ డోసు పెంచి వాటిని అలవాటు చేశారని సంజయ్ వెల్లడించారు.
 
ఆ తరువాత 6 రోజులపాటు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పేర్కొంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్  స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేయరని, ఫిర్యాదు చేసిన ఒకటి రెండ్రోజులకే ఆ అమ్మాయిలను ఇంటి వద్ద వదిలి వెళతారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్లి బట్టలిప్పి అత్యాచారం చేస్తూ మొత్తం వీడియో తీశారని, ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాం… మీ స్కూల్ కు పంపుతామని బెదిరించారని సంజయ్ వెల్లడించారు. 
 
ఇది ఒక్క అమ్మాయి విషయంలోనే కాదని, ఇట్లాంటి కేసులు అక్కడ చాలా ఉన్నాయని చెప్పారు.  సుమారు రెండు దశాబ్దాల కిందట జీవనోపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కొన్ని కుటుంబాలు పాతబస్తీలో  కూలీనాలీ చేసుకుని బతుకుతుండగా, వారి  పక్కన ఉన్న ఈ ఇద్దరి బిడ్డలను స్థానికంగా ఉండే ఆదిల్ అలియాస్ అజీజ్ ముఠా డ్రగ్స్ కు అలవాటు చేసి చివరికి బానిసల్ని చేశారని సంజయ్ ఆరోపించారు. 
 
గత నెల 26న తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ కూర్చున్న ఒక తండ్రి మైనర్ కుమార్తె (వయస్సు 16 సంవత్సరాలు)ను ఒక డ్రగ్స్ గ్యాంగ్ రాత్రిపూట తీసుకెళ్లారని,  మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచేసరికి ఆమె ఇంట్లో లేదని తెలిపారు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, మొన్న పోయింది కదా… ఇప్పుడు కూడా వస్తది లేదు.. ప్రాణాలతో వస్తే సరిపోతది కదా? అంటూ అక్కడి పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ పంపించారని కేంద్ర సహాయమంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

చివరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమా మహెందర్ వెళ్లి పోలీసులపై వత్తిడి చేసి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని బెదిరిస్తే  ఆ బాలికను డ్రగ్స్ గ్యాంగ్ పోలీసు స్టేషన్ పరిసరాల్లో వదిలి వెళ్లారని సంజయ్ చెప్పారు. ఎవరకైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తాం అని బాలికను బెదిరించారని తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు ఆ మైనర్ బాలిక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. తన వద్ద ఏ వస్తువుంటే ఆ వస్తువును విసిరికొడుతూ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తోందని, మళ్లీ డ్రగ్స్ కోసం ఆదిల్ అనే వ్యక్తి తీసుకెళుతున్న ద్రుశ్యాలు కూడా సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యాయని వివరించారు.

ఆ బాలికను తల్లిదండ్రులు, కాలనీ వాళ్లు గుచ్చి గుచ్చి అడిగితే తనతో పాటు మరెందరో మైనర్ బాలికలకు డ్రగ్స్ బలవంతంగా తినిపించినట్లు ఆమె చెప్పిందని సంజయ్ వెల్లడించారు. ఆదిల్ అతని స్నేహితులు (ఆ సమూహ సభ్యులు) వారి లైంగిక చర్యలను వీడియోలు, నగ్న చిత్రాలను చిత్రీకరిస్తూ వారిని లైంగిక చర్యలకు బలవంతం చేశారని ఆ అమ్మాయి వాపోయిందని తెలిపారు. తర్వాత కూడా ఈ బాలికలను బ్లాక్ మెయిల్ చేస్తునే ఉన్నారని,  సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తామని బెదిరించారని చెప్పారు.

ఆ బాలిక ఆరోగ్యం బాగా లేకపోవడంతో  ఈ నెల 6న  తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, డ్రగ్స్ గ్యాంగ్ మెయిన్ లీడర్ అజీజ్ అలియాస్ ఆదిల్ అనే వ్యక్తి వాళ్లను అడ్డగించిం, అమ్మాయిని స్కూటర్‌పై బలవంతంగా తీసుకెళ్లాడని సంజయ్ తెలిపారు. తల్లి దండ్రులు అతనిని వెంబడించినా వాళ్ళను పట్టుకోలేక పోయారని,  చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో నేడు నమోదయింది చెప్పారు. అయితే, పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 
ఇప్పుడా అమ్మాయి భరోసా సెంటర్ లో ఉందని చెబుతూ ఇట్లాంటి అమాయక మైనర్ బాలికలు ఎందరో ఆ డ్రగ్స్ రాకెట్ గుప్పిట్లో బందీలై విలవిల్లాడుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు.  ఒకవేళ ఒత్తిడి తెస్తే ఎవరైనా డ్రగ్స్ ముఠా సభ్యుడిని పోలీసులు పట్టుకొస్తే స్థానిక మజ్లిస్ నాయకులు స్టేషన్ కు వచ్చి తీసుకెళ్లిపోతారని తెలిపారు. ముఖ్యమంత్రికి ఆ డ్రగ్స్ గ్యాంగ్ ను పట్టుకునే దమ్ము లేదా? అని సంజయ్ సవాల్ చేశారు.