బిహార్‌కు అవినీతి, తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదంటూ మహాగఠ్‌బంధన్‌పై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు నిద్రలేని రాత్రులు ఇస్తున్నారని సీతామర్హిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో బాలుడు మాట్లాడిన విషయంపై పరోక్షంగా స్పందిస్తూ తాము విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఫుట్‌బాల్‌లు, హాకీ స్టిక్‌లను అందిస్తున్నామని మోదీ తెలిపారు. కానీ ప్రజలకు రివాల్వర్లు ఇవ్వడం గురించి ఆర్జేడీ మాట్లాడుతుందని దుయ్యబట్టారు.
పిల్లలను గ్యాంగ్స్టర్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారి మెదళ్లలో విషం నింపుతున్నారని విమర్శించారు. యువతను రౌడీలు, దోపీడీదారులుగా మార్చాలని ఆర్జేడీ కోరుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో కేంద్రం రూపాయి ఇస్తే ప్రజలకు 15 పైసలే అందేవని మండిపడ్డారు. దోపిడీకి కారణమెవరో అందరికీ తెలుసని దుయ్యబట్టారు.
“బిహార్‌లో పిస్టల్‌తో వచ్చి హ్యాండ్సప్ అని చెప్పడం. ఫ్యాషన్‌గా ఉండేది కదా. ఇప్పుడు బిహార్‌లో అలాంటివారికి స్థానం లేదు. బిహార్‌లో స్టార్టప్‌ల గురించి కలలు కనేవారు కావాలి. హ్యాండ్సప్ చెప్పేవాళ్లు వద్దు. మేం పిల్లల చేతికి పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నాం. మనపిల్లలు ఆటల్లో ఎదగాలని వారికి క్రికెట్ బ్యాట్లు ఇస్తున్నాం. హాకీస్టిక్, ఫుట్‌బాల్, వాలీబాల్ అందిస్తున్నాం” అని ప్రధాని తెలిపారు.
కానీ ఆర్జేడీ మాత్రం బిహార్ యువతకు రివాల్వర్లు, డబుల్ బ్యారెల్ గన్లు ఇవ్వడం గురించి మాట్లాడుతోందని ప్రధాని ధ్వజమెత్తారు. ఆ వ్యక్తులు తమ పిల్లలను మాత్రం మంత్రిని చేయాలనుకుంటున్నారని, తమ పిల్లలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులను చేయాలని వారు కలలు కంటున్నారని మండిపడ్డారు.
“అలా రాష్ట్రంలోని పిల్లల కోసం ఆర్జేడీ ఏం చేయాలనుకుంటుందో వారి ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కన్పిస్తోంది. జంగిల్‌రాజ్‌ల పాటలు, నినాదాలు వినండి. కచ్చితంగా మీరు షాక్ అవుతారు. వారి వేదికలపై అమాయక పిల్లలతో దోపిడీదారులుగా, గ్యాంగ్స్టర్లుగా మారాలనుకుంటున్నామని చెప్పాలంటూ బలవంతం చేస్తున్నారు. అందుకే బిహార్‌లో పిల్లలు డాక్టర్లు అవ్వాలా? దోపిడీదారులు కావాలా?” అని ప్రధాని ప్రశ్నించారు.
మన పిల్లలను చెడ్డవారిగా మారాలని కోరుకునే వారిని మనం ఎప్పుడైనా గెలిపిస్తామా? అంటూ ప్రజలకు ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు ఇండస్ట్రీలో ఏ,బీ,సీ,డీలు కూడా తెలియవని మోదీ ఎద్దేవా చేశారు. పరిశ్రమలు ఎలా మూసేయాలో మాత్రమే వారికి తెలుసని విమర్శించారు. జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో బిహార్‌లో ఓ పెద్ద ఆస్పత్రి గానీ, వైద్య కళాశాల కానీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వచ్చాకే బిహార్ ప్రజలకు కోల్పోయిన నమ్మకం తిరిగి వచ్చిందని తెలిపారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను నిందించిన వారిని ఎన్నికల్లో శిక్షించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మొదట విడత పోలింగ్‌లో ప్రజలు ఎన్డీఏ వైపు ఉన్నారని తెలిపారు.

More Stories
సున్నితమైన సమాజం మాత్రమే ప్రతి మానవుడిని ఉద్ధరిస్తుంది
4 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
అరుదైన ఖనిజాల్లో చైనా పెత్తనం.. అమెరికాకు దిక్కు భారత్ మాత్రమే!