పాక్ అణుకేంద్రంపై దాడిని అడ్డుకున్న ఇందిరా గాంధీ!

పాక్ అణుకేంద్రంపై దాడిని అడ్డుకున్న ఇందిరా గాంధీ!

పాకిస్తాన్ అణ్వస్త్ర శక్తిగా ఎదగకుండా నిరోధించడానికి 1980లలో భారత్, ఇజ్రాయిల్ దేశాలు కలిసి చేసిన ఒక రహస్య సైనిక ఆపరేషన్ ప్ర‌ణాళిక‌ను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తిర‌స్క‌రించిన‌ట్లు అమెరికా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ప‌టి ప్ర‌భుత్వం ఈ ఆప‌రేష‌న్‌ను తిర‌స్క‌రించ‌డాన్ని ఆయ‌న సిగ్గు చేటుగా అభివర్ణించారు.

పాకిస్తాన్ లోని కహూతా అణుకేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు రూపొందించిన ఈ ఆపరేషన్‌కు ఇందిర ఆమోదం తెలిపి ఉంటే ప్రపంచానికి ఎన్నో సమస్యలు తప్పి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. అణ్వాయుధాల‌ను పాక్ అభివృద్ధి చేయ‌కుండా, వాటిని ఇత‌ర దేశాల‌కు అందించ‌కుండా నిరోధించేందుకు దాడి చేయాల‌ని ప్ర‌ణాళిక ర‌చించాయి.

అయితే, ఈ ర‌హ‌స్య ఆప‌రేష‌న్‌ను అప్ప‌టి భార‌త ప్ర‌భుత్వం అడ్డుకుంది. అణు కార్యక్రమ రూపశిల్పి ఏక్యూ ఖాన్ నేతృత్వంలో అభివృద్ధి చెందిన కహూతా కేంద్రం చివరికి పాకిస్థాన్‌ను అణ్వస్త్ర దేశంగా మార్చింది. పాక్‌లోని కహూతా అణుకేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు రూపొందించిన ఈ ఆపరేషన్‌కు ఇందిర ఆమోదం తెలిపి ఉంటే ప్రపంచానికి ఎన్నో సమస్యలు తప్పి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, ప్రపంచంలో అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణు కార్యకలాపాలు కొనసాగించడంలో పాక్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని పేర్కొంది.  స్మగ్లింగ్‌, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అలవాటేనని, ఏక్యూ ఖాన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ చుట్టూ ఇది కేంద్రీకృతమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.
ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ ఎల్లప్పుడూ తీసుకెళ్తూనే ఉంటుందని తెలిపారు.  “రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణు కార్యక్రమాలను కొనసాగించడం పాకిస్థాన్‌ చరిత్రలోనే ఉంది. స్మగ్లింగ్‌, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్యం భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అలవాటే. ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్‌ తీసుకెళ్తుంది. పాకిస్థాన్‌ అణు పరీక్షలు కొనసాగిస్తుందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మేము పరిశీలిస్తున్నాం”అని జైస్వాల్ తెలిపారు.

గత ఆదివారం ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా మళ్లీ అణుపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు పాకిస్థాన్, ఉత్తర కొరియా సహా అనేక దేశాలు భూగర్భ అణుపరీక్షలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు భారత్ ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పాకిస్థాన్ అణ్వస్త్రాలను తయారు చేసుకుందని మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో తెలిపారు. అయితే పాక్ అణు కార్యక్రమాల రూపశిల్పి అబ్దుల్ ఖదీర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) మాత్రం ఈ న్యూక్లియర్ బాంబ్ సాంకేతికతను పాకిస్థాన్ తో పాటు, ఇరాన్ సహా ఇస్లామిక్ దేశాలు అన్నింటికీ అందించాలని భావించారని బార్లో తెలిపారు. ఇదే ఇప్పుడు ఇస్లామిక్ బాంబుగా పరిణామం చెందిందని ఆయన పేర్కొన్నారు.

“ఏక్యూ ఖాన్ 1990ల ప్రారంభంలో ఇరాన్కు కీలకమైన గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని, బహుశా అణ్వాయుధ ప్రణాళికను అందించాడు. 1974లోనే అణ్వాయుధాలను సమకూర్చుకున్న భారత్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పాక్ మొదట్లో వ్యూహాత్మక అణు కార్యకలాపాలు చేపట్టింది. కానీ ఏక్యూ ఖాన్ సహా పాక్ మిలటరీ జనరల్స్ దృక్కోణం నుంచి చూస్తే అది కేవలం పాకిస్థానీ బాంబు కాదు. అది ఇస్లామిక్ బాంబ్, ముస్లిం బాంబ్” అని బార్లో పేర్కొన్నారు.