ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగమ్మాయి శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. శ్రీచరణికి రూ.2.5 కోట్లు నగదు పురస్కారం, గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ఘనంగా సత్కరించింది.
వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత యావత్ దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీచరణి. తాను క్రికెట్ ఆడేందుకు తన కుటుంబం నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని ఆమె తెలిపారు. తన మామ తనను తీసుకెళ్లి క్రికెట్ ఆడించేవారని, తాను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు. ప్రపంచ కప్ మొదటి అడుగు మాత్రమేనని, ముందు చాలా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారని చెప్పుకొచ్చారు శ్రీచరణి.
అంతకముందు శ్రీచరని, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీచరణిని చంద్రబాబు, లోకేశ్ అభినందించారు. ప్రపంచకప్ గెలుచుకుని టీమిండియా సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని, ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని చంద్రబాబు ప్రశంసించారు.
అంతకముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణిలతో పాటుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీచరణిని ఘనంగా సన్మానించారు.

More Stories
మద్యం కేసులోనూ జగన్ ముద్దాయి కాబోతున్నారు
మొంథా తుఫాన్ బాధిత రైతులకు పంటల భీమా ప్రశ్నార్ధకం!
ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు