కార్తీక పౌర్ణమి రోజున బీవర్‌ సూపర్‌ మూన్‌!

కార్తీక పౌర్ణమి రోజున బీవర్‌ సూపర్‌ మూన్‌!

కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. అంటే నవంబర్ 5న ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీన్నే బీవర్‌ సూపర్‌ మూన్‌గానూ పిలుస్తారు. ఈ సూపర్‌ అరుదైన ఖగోళ దృగ్విషయం కాగా,  పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరడంతో ఈ అద్భుతం దృశ్యం ఏర్పడుతుంది.

గతంలో  చైనాలోని చెంగ్డులోని లాంగ్‌క్వాన్‌ పరత్వ ప్రాంతంలో  ఇలాంటి దృశ్యం కనిపించింది. ఈ సారి భూమికి చంద్రుడు మరింత దగ్గరగా ఉంటాడు. చల్లని శరదృతువు రాత్రిలో మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. ఈ సూపర్‌మూన్ ఈ ఏడాదిలో ఏర్పడనున్న మూడు సూపర్‌మూన్‌లో రెండోది. 

ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల నుంచి బీవర్‌ సూపర్‌ మూన్‌గా పేరు వచ్చింది. బీవర్లు శీతాకాలంలో గుహలను నిర్మించే, నదులు గడ్డకట్టే ముందు వేటగాళ్లు ఉచ్చులు వేసే సీజన్‌ను ఇది సూచిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. కానీ, కక్ష్యలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా, దూరంగా వెళ్తుంటాడు. 

పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చిన దృష్యాన్ని సూపర్‌ మూన్‌గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు భూమి నుండి దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ కారణంగా ఇది సాధారణ పౌర్ణమి కంటే ఏడుశాతం పెద్దగా ఉంటుంది. అలాగే, 16శాతం ఎక్కువ చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 

చంద్రుడు చేరుకున్న సమయంలో భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యకు దగ్గరగా ఉన్న పెరిజీ దగ్గర ఉన్నప్పుడు సూపర్‌మూన్ సంభవిస్తుంది. శాస్త్రీయ భాషలో దీన్ని పెరిజీ పౌర్ణమిగా పిలుస్తారు. కానీ, ప్రతి సూపర్‌మూన్‌ ఒకేలా ఉండదు. చంద్రుడు రాత్రంతా ప్రకాశవంతమైన రాశిచక్రం నక్షత్రరాశి వృషభంలో ఉంటాడు. ప్రకాశవంతమైన కాంతి సమీపంలోని నక్షత్రాలను అస్పష్టంగా చేస్తుంది. 

కానీ, టెలిస్కోప్‌ ద్వారా చంద్రుడిని చూస్తే నీరింజ, ఎరుపు నక్షత్రం ఆల్డెబరాన్‌ను చూడొచ్చు. ఇది భూమి నుంచి 65 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. చంద్రుడు, ఆల్డెబరాన్‌ మధ్య ప్లీయేడ్స్‌ ఉంది. ప్లీయేడ్స్‌ను సెవెన్‌ సిస్టర్స్‌గా పిలుస్తారు. ఇది బిగ్‌ డిప్పర్‌ను పోలి ఉండే మెరిసే నక్షత్ర సమూహం.  ఇది భూమి నుంచి 330 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. బీవర్‌ మూన్‌ను చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఆకాశం వైపుగా చూస్తే సరిపోతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు.