2005లో బిహార్లో నీతీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభిృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ఆర్జేడీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ తన అధికారాన్ని కోల్పోవడాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఐ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టులను నిలిపివేసిందని ధ్వజమెత్తారు. సోమవారం బిహార్లోని సహార్సా, కటిహార్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆర్జేడీ, కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“బిహార్‌లో 2005లో ఆర్జేడీ అధికారాన్ని కోల్పోయినప్పుడు, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఆమోదించిన కోసీ మహాసేతు వంటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రజలు ఓడించారనే కోపంతో ఆర్జేడీ నిలిపివేసింది. వారు యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిహార్ అభివృద్ధిని అడ్డుకున్నారు. కోసీ ప్రాంత ప్రజలు అనుభవించిన కష్టాలను ఆర్జేడీ ఎప్పటికీ అర్థం చేసుకోలేదు” అంటూ విమర్శించారు.
“మేం నదుల అనుసంధాన ప్రాజెక్టుపై కూడా పనిచేస్తున్నాం. మా ఎన్డీఏ మేనిఫెస్టోలో అందుకోసం కోసం స్పష్టమైన ప్రణాళిక ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేలా తొలిసారి ఓటువేసే వారు తమ హక్కును వినియోగించుకోవాలి. ఆర్జేడీ పాలనలో చట్టం అనే పదం లేకుండా పోయింది. విధిని నిజాయితీగా నిర్వర్తించాలనుకున్న పోలీసులు కూడా సురక్షితంంగా లేరు” అని గుర్తు చేశారు.
రహదారులు నిర్మిస్తున్న కార్మికులను హతమార్చారని, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలు దారుణాలకు గురయ్యారని పేర్కొంటూ చట్టాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకున్న డీఎస్పీ సత్యపాల్‌సింగ్‌ను హత్య చేశారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో బిహార్లో బలహీనమైన కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి పోటీ చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు.
“ఆర్జేడీ చేసిన పాపాలకు శిక్ష విధించాలని బిహార్ ప్రజలను కోరారు. ఎన్డీఏ అభివృద్ధి కోసం నిలిస్తుంటే, జంగిల్ రాజ్ వాళ్లు వినాశనం కోసం నిలబడతారు. కాంగ్రెస్ తలపై ఆర్జేడీ వ్యక్తులు నాటు తుపాకీ పెట్టి, తేజస్వీ యాదవ్ను ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని ఒత్తిడి తెచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు ఆర్జేడీ ముంచేయాలనే సంకల్పం చేసింది” అని ప్రధాని హెచ్చరించారు.
ఇక ఆర్జేడీ కాంగ్రెస్ కలయిక చొరబాటుదారుల పట్ల మృదువుగా ఉంటుందని, వారికి ప్రపంచ వ్యాప్తంగా పర్యటించడానికి సమయం దొరుకుతుందని, కానీ కానీ అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించడానికి ఉండదని ప్రధాని ఎద్దేవా చేశారు. అలాగే ఛఠ్ పండగను గౌరవం కూడా ఇవ్వరని ధ్వజమెత్తారు. వారికి రాముడిపై అంత ద్వేషం ఉంటే, నిషాదరాజు, వాల్మీకి జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకాలను చూసి రావచ్చని ప్రధాని మోదీ చెప్పారు.

More Stories
సుప్రీంకోర్టులో ట్రంప్ టారీప్లపై భారత సంతతి లాయర్ సవాల్
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన