అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.95లక్షల కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 4.6శాతం పెరిగాయి. 2024 అక్టోబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.87లక్షలుగా ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ (సిజీఎస్టీ), స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) అన్నీ అక్టోబర్ నెలలో వృద్ధిని నమోదు చేయగా, సెస్ వసూళ్లు మాత్రం తగ్గాయి.
2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) మొత్తం జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2017లో జీఎస్టీని అమలు చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం. భారత జీఎస్టీ వ్యవస్థ 2024-25లో రూ.22.08 లక్షల కోట్ల రికార్డు స్థూల వసూళ్లతో మైలురాయిని సాధించింది.
ఇదిలా ఉండగా అక్టోబర్ నెలలో జీఎస్టీ రూ.1.87 లక్షల కోట్లు వసూలు జరిగాయి. ఆ మొత్తం 1.96 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మొత్తం రూ.1.86 లక్షలు కోట్లు వసూలవగా.. సెప్టెంబర్‌లో 1.89 లక్షలు కోట్లుగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. గతేడాదితో పోల్చినప్పుడు 4.6 శాతం వృద్ధి నమోదైంది.
అయితే, గడిచిన నెలలతో పోల్చి చూస్తే సగటున 9 శాతం వృద్ధి కంటే తక్కువ నమోదైంది. అక్టోబర్ జీఎస్టీ వసూళ్లలో రూ.1.45 లక్షల కోట్లు దేశీయ వినియోగం నుంచి.. దిగుమతులపై సుంకాల ద్వారా రూ.50,884 కోట్లు వచ్చాయి. జీఎస్టీ రిఫండ్స్ రూ.26,934 కోట్లు మినహాయిస్తే నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జీఎస్టీ వసూళ్లు 9 శాతం పెరిగి రూ. 13.89 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 12.74 లక్షల కోట్లుగా ఉంది. రీఫండ్‌లను మినహాయిస్తే, అక్టోబర్‌లో నికర వసూళ్లు రూ. 1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
సెప్టెంబరులో జీఎస్టీ (జీఎస్టీ) రేట్లను సరళీకరించడం, పండగ సీజన్‌లో వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ వృద్ధికి దారితీశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారులకు తగ్గింపుల ప్రయోజనం అందడంతో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో వినియోగం 10 శాతానికి పైగా పెరిగి, సుమారు రూ. 20 లక్షల కోట్ల మేర అదనపు వ్యయం జరిగే అవకాశం ఉందని అంచనా.
అదేవిధంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కూడా వృద్ధి కనిపిస్తుంది. అక్టోబర్ 12 నాటికి నికర ప్రత్యక్ష పన్నులు 6.33 శాతం పెరిగి రూ. 11.89 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్ పన్ను రూ. 5.02 లక్షల కోట్లు, వ్యక్తిగత పన్ను రూ. 6.56 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!