మజీతియా నియోజకవర్గం నుంచి మజీతియా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జూన్ 25వ తేదీ ఆయన్ను అమృత్సర్లో అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి డిజిటల్ డివైస్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులను విజిలెన్స్ బ్యూరో సీజ్ చేసింది. మొహాలీ కోర్టు ఆయనకు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఆ తర్వాత జూలై 6న జుడిషియల్ కస్టడీలోకి తీసుకెళ్లారు.
ఆగస్టు 22వ తేదీన విజిలెన్స్ బ్యూరో పూర్తి వివరాలతో అభియోగాలు నమోదు చేసింది. సుమారు 200 మంది సాక్ష్యుల నుంచి 40 వేల పేజీల ఆధారాలను సేకరించింది. 2013లో పంజాబ్లో సుమారు రూ. 6 వేల కోట్ల సింథటిక్ డ్రగ్ రాకెట్ చోటుచేసుకున్నది. మాజీ డీఎస్పీ జగదీశ్ సింగ్ బోలాను ఈ కేసులో విచారించారు.
డ్రగ్ కేసుతో మజీతియాకు లింకు ఉన్నట్లు జగదీశ్ విచారణలో వెల్లడించారు. అయితే డ్రగ్స్ కలిగి ఉన్న కేసులను గతంలో కోర్టు కొట్టివేసింది. కానీ మనీల్యాండరింగ్ కేసులో మాత్రం విచారణ కొనసాగుతున్నది. ఆగస్టులో ఆయనకు బెయిల్ నిరాకరించారు. సెప్టెంబర్లో పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆయనకు తాత్కాలిక బెయిల్ దొరికింది. మొహాలీ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సి ఉన్నది.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!